పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస బిగ్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రభాస్, కృతిసనన్ జంటగా దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్న మైథలాజికల్ మూవీ ‘ఆదిపురుష్’. రామాయణం నేపథ్యంలో 3డి మోషన్ కాప్చర్ టెక్నాలజీతో రూపొందుతున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 2023 జనవరి 12న విడుదల కాబోతుంది. ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్ రావణుడి(లంకేశ్)గా, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా నటిస్తున్నారు.
ఇక ఈ భారీ బడ్జెట్ సినిమాలో ప్రభాస్ రాఘవ్(రాముడు)గా, కృతిసనన్ సీతగా కనిపించనున్నారు. అయితే.. ఇటీవలే చిత్రబృందం ఏప్రిల్ 10 ఆదిపురుష్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది. రాఘవుడిగా ప్రభాస్ లుక్ చూడాలనే ఆసక్తి డార్లింగ్ ఫ్యాన్స్ అందరిలో పెరిగిపోయింది. ఈ క్రమంలో ప్రముఖ సినీ క్రిటిక్ ఉమైర్ సంధు.. ఆదిపురుష్ ఫస్ట్ లుక్ చూసేశానని తన ఫస్ట్ రివ్యూ ఇచ్చాడు.ట్విట్టర్ వేదికగా ఉమైర్ సంధు స్పందించి.. “ఆదిపురుష్ ఫస్ట్ లుక్ అద్భుతంగా ఉంది! మునుపెన్నడూ చూడని విధంగా ప్రభాస్ కనిపిస్తున్నాడు. దీన్నే బెస్ట్ కమ్ బ్యాక్ ఫిల్మ్ అంటారు” అని రాసుకొచ్చాడు. ఇక ఉమైర్ పోస్ట్ తో ఫ్యాన్స్ లో అంచనాలు పెరిగినప్పటికీ, నెటిజన్లు మాత్రం ఉమైర్ సంధు ఫస్ట్ రివ్యూని ట్రోల్ చేస్తున్నారు. ఇంకా రిలీజ్ కాలేదు అప్పుడే రివ్యూ ఇస్తున్నావ్ అంటూ ఫైర్ అవుతున్నారు. ఇదిలా ఉండగా.. ఆదిపురుష్ చిత్రాన్ని టి-సిరీస్, రెట్రోఫిల్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. మరి ఆదిపురుష్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
#AdiPurushFirstLook is MINBLOWING ! #Prabhas looks like never before. This is called a Best COME BACK FILM 🔥🔥🔥🔥 ! Can’t wait for #AdiPurush. #AdiPurushFirstLookOnApril10th
— Umair Sandhu (@UmairSandu) March 31, 2022