సినీ లోకంలో ఏ పని చేసినా, ఏ మాట మాట్లాడినా అది జనాల్లోకి క్షణాల్లో వెళ్లిపోతుంది. అందుకే ఏ మాట మాట్లాడినా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. లేక పోతే ఎక్కడా లేని తలనొప్పిని కావాలనే తెచ్చుకున్నట్లు ఉంటుంది. తాజాగా ఇలాంటి తల నొప్పినే బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ తెచ్చుకున్నాడు. దొబారా మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్య్వూ లో హీరోయిన్ తాప్సీ పై అసభ్యకర పదాలను వాడి విమర్శలకు గురి అయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ వ్యాఖ్యలపై ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ స్పందించాడు. దీనికి సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
తాప్సీ పన్ను.. తెలుగు తెరపై తనకంటూ ఓ పేరు తెచ్చుకుంది. అయితే ఈ అమ్మడుకి అనుకున్నంత పేరైతే రాలేదనే చెప్పాలి. దాంతో తెలుగులో అవకాశాలు దక్కించుకోవడంలో వెనక బడ్డ తాప్సీ చిన్నగా తన మకాంను బాలీవుడ్ కు మార్చింది. అక్కడ వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ దూసుకెళ్తుంది. కానీ మూవీ విజయాలు మాత్రం అంతంత మాత్రంగానే దక్కుతున్నాయి.
ఈ క్రమంలో తాజాగా తాప్సీ మరో మూవీ దొబారాతో ఆగస్టు 19న వెండితెరను పలకరించగా అక్కడా నిరాశే ఎదురైంది. స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేక పోయింది. ఇక ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో అనురాగ్ కశ్యప్ తాప్సీపై హాట్ కామెంట్స్ చేశాడు. తాప్సీ ఎద భాగం కంటే నా ఎద భాగమే పెద్దది అంటూ అనురాగ్ కశ్యప్ మాట్లాడాడు. దాంతో తాప్సీ నవ్వుతూ తల పట్టుకుంది. గతంలో ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారడంతో అంతటా విమర్శలు వెళ్లువెత్తాయి.
అయితే ఈ ఇంటర్వ్యూపై బాలీవుడ్ ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్ కమల్ రషిద్ కుమార్(KRK) తనదైన శైలిలో స్పందిస్తూ అనురాగ్ ను ఇరికిస్తూ ట్వీట్ చేశాడు. కేఆర్కే స్పందిస్తూ.. ”తాప్సీ విషయం నికెలా తెల్సు” అంటూ అడిగాడు. ప్రస్తుతం ఈ ట్విట్స్ పై నెట్టింట్లో చర్చలు, కామెంట్లు, విమర్శలు వస్తున్నాయి. కమల్ బాలీవుడ్ లో ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు. అతడు ఏ విషయాన్నైనా కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్తాడు. దాంతో అతడి పోస్ట్ లు తెగ వైరల్ అవుతూ ఉంటాయి. మరి అనురాగ్ కశ్యప్ తాప్సీ పై చేసిన కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Anurag Kashyap jokes about his body: ‘I have bigger b**bs than Taapsee Pannu’
Now waiting for taapsee’s “Befitting Reply”😆 pic.twitter.com/UenTKe7LHx— 🤞NAMAN🤞 (@Namanjoshi231) August 23, 2022