కరోనా మిగిల్చిన చేదు జ్ఞాపకాల నుండి, నష్టాల నుండి బయటపడాలని తెలుగు చలన చిత్ర పరిశ్రమ ప్రయత్నాలు మొదలు పెట్టింది. కరోనా కారణంగా గత రెండు నెలలుగా షూటింగ్స్ కి బ్రేక్ పడింది. ఇప్పుడు.. సెకండ్ వేవ్ ప్రభావం కాస్త తగ్గడంతో.. రోల్ కెమెరా అనడానికి టాలీవుడ్ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి కొన్ని షరతులు విధించింది. తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి. తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్. తెలుగు ఫిలిం డైరెక్టర్ అసోసియేషన్, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ జాయింట్ మీటింగ్ ఛాంబర్ కార్యాలయంలో జరిగింది. ఈమీటింగ్ లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
1) ఏప్రిల్ నుండి షూటింగ్స్ ఆగిపోయాయి కాబట్టి ముందుగా ఆగిన చిత్రాలను పూర్తి చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం ఇండస్ట్రీలో 24 క్రాఫ్ట్స్ పీపుల్స్ సహకరించాలని, ఈ ప్రాజెక్ట్స్ పూర్తి చేశాకనే కొత్త చిత్రాలకి డేట్స్ అడ్జెస్ట్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
2) దర్శక నిర్మాతలు ఈ విషయంలో ఆర్టిస్ట్ లను కో- ఆర్డినేట్ చేసుకోవాలని, వీలైతే.., షెడ్యూల్ డేస్ కుదించుకోవాలని కోరింది.
3) ఇక షూటింగ్ చేసే షూటింగ్ చేసే ప్రొడక్షన్ హౌస్ వారు ఆర్టిస్ట్ ల నుండి టెక్నీషియన్ నుండి వ్యాక్సిన్ తీసుకున్నట్లుగా డిక్లరేషన్ తీసుకోవాలని నిర్ణయించారు.
4)ఇక సెట్ లో ఉండే ఫెడరేషన్ లోని 24 విభాగాల సభ్యులందరికీ ఇన్సూరెన్స్ ఉండాలని, ఈ బాధ్యతని ఫెడరేషన్ మరియు ఆయా యూనియన్ లీడర్స్ చూసుకోవాలని సూచించింది
5) ప్రభుత్వ ఆదేశాలను ఏ ప్రొడక్షన్ హౌస్ అయినా తప్పక పాటించాలని తీర్మానించారు.