ప్రస్తుతం థియేటర్‌కు వెళ్లి సినిమా చూడాలంటే చాలా మంది వెనుకంజ వేస్తున్నారు. దీనికి కారణం అధిక ధరలు. టికెట్ రేట్ల కంటే పాప్ కార్న్, సాఫ్ట్ డ్రింక్స్ రేట్లు ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి తరుణంలో సినిమా చూస్తే తాము రివర్స్‌లో డబ్బులు ఇస్తామంటూ ఒక వెబ్ సైట్ బంపర్ ఆఫర్ ప్రకటించింది.
ఈ రోజుల్లో సినిమా చూసేందుకు థియేటర్లకు వెళ్లాలంటే ప్రేక్షకులు భయపడుతున్నారు. ముఖ్యంగా మల్టీప్లెక్సుల్లో మూవీస్ చూడాలంటే అందరిలో గుబులు పుడుతోంది. దీనికి కారణం రేట్లు అనే చెప్పాలి. ఒక ఫ్యామిలీ కలసి థియేటర్లో సినిమా చూడాలంటే సుమారుగా రూ.2 వేల వరకు ఖర్చు అవుతోంది. మూవీ టికెట్ ధర కంటే కూడా పాప్ కార్న్, కూల్ డ్రింక్స్ రేట్లు ఎక్కువగా ఉన్నాయి. దీంతో థియేటర్‌కు వెళ్తే జేబు గుల్ల అవుతుందని ప్రేక్షకులకు డిసైడ్ అవుతున్నారు. అందుకే అన్ని చిత్రాలకు కాకుండా.. మంచి బజ్ నెలకొన్న మూవీస్, పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిన చిత్రాలు చూసేందుకు ఆడియెన్స్ థియేటర్లకు వెళ్తున్నారు. ఇదిలా ఉంటే.. ఒక వెబ్సైట్ సినీ ప్రేక్షకులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది.
ఒక సినిమాను చూస్తే వాళ్లే డబ్బులు రివర్స్ ఇస్తారట. అది కూడా వందో, రెండొందలో కాదు.. ఏకంగా రూ.82 వేలు ఇస్తామంటున్నారు. ఆ మూవీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. హాలీవుడ్ యాక్షన్ మూవీస్‌లో ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ సిరీస్‌కు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ సినిమా ఇప్పటి వరకు తొమ్మిది భాగాల్లో విడుదలై సూపర్ హిట్స్‌గా నిలిచాయి. ఈ చిత్రంతో విన్ డీజిల్ ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించాడు. మే 19వ తేదీన ఈ సిరీస్ నుంచి పదో సినిమాగా ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఎక్స్’ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఫైనాన్స్ బజ్ అనే ఒక అంతర్జాతీయ వెబ్సైట్ ఆడియెన్స్‌కు బంపర్ ఆఫర్ ప్రకటించింది.
‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ సిరీస్‌లో ఇప్పటిదాకా వచ్చిన 10 భాగాలను చూసి.. అందులో ఏ కారు బాగా డ్యామేజ్ అయ్యిందో నోట్ చేసి తమకు చెప్పాలని ఫైనాన్స్ బజ్ చెప్పుకొచ్చింది. దీని వల్ల ర్యాష్ డ్రైవింగ్ కారణంగా కంపెనీకి ఎంత ఇన్సూరెన్స్ భారం పడుతుందనేది అంచనా వేస్తారట. వారి అంచనాలకు దగ్గరగా చెప్పిన ప్రేక్షకులకు 1000 డాలర్ల నగదు బహుమతిని అందజేస్తారు. అలాగే మూవీ టికెట్స్, స్నాక్స్ కోసం మరో 100 డాలర్లు అదనంగా ఇస్తామని ఫైనాన్స్ బజ్ వెల్లడించింది. అయితే ఈ ఆఫర్ అమెరికాలో ఉన్నవారికేనని.. అది కూడా 18 ఏళ్లు నిండినవారికే వర్తిస్తుందని ప్రకటనలో స్పష్టం చేసింది. మూవీ రిలీజ్ డేట్ మే 19 వరకు రిజిస్టర్ చేసుకోవచ్చని తెలిపింది. మే 26 లోపు విన్నర్స్‌ను ప్రకటిస్తామని ఫైనాన్స్ బజ్ పేర్కొంది.