చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ కు చెందిన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్, హీరోయిన్లకు స్టైలిస్ట్ గా పనిచేసిన ప్రత్యూష గరిమెళ్ళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆమె ఆత్మహత్యకు గల కారణాలేంటి? అసలేం జరిగింది? అనే వివరాల్లోకి వెళితే.. దేశంలో టాప్ టాప్ 30 ఫ్యాషన్ డిజైనర్స్ లో ఒకరైన ప్రత్యూష హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో నివాసముంటున్నారు. స్టార్ హీరోయిన్స్ దీపికా పదుకొనే, కీర్తి సురేష్, శృతిహాసన్, రకుల్ ప్రీత్ సింగ్, శ్రేయ, నిక్కీ గల్రాని, కృతికర్బంధ, ప్రణీత సహా అనేక మంది హీరోయిన్లకు ప్రత్యూష డ్రెస్సులు డిజైన్ చేశారని తెలుస్తోంది.
ఇక బంజారాహిల్స్ లోని ఎమ్మెల్యే కాలనీలో ఉన్న ఆమె ఇంటి బాత్రూంలో సూసైడ్ కి పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయితే.. ప్రత్యూష బాత్రూంలో కార్బన్ మోనాక్సైడ్ బాటిల్ లభ్యమైనట్లు తెలుస్తోంది. దీంతో ఆ బాటిల్ ను పోలీసులు స్వాధీనం చేసుకుని క్లూస్ టీం కి అప్పగించారు.ఈ వ్యవహారం మీద అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు పోలీసులు.
డిప్రెషన్ లో గురైన ప్రత్యూష.. ఎలక్ట్రికల్ గ్రిల్ లో కార్బన్ మోనాక్సైడ్ కెమికల్ వేసి ఆ తర్వాత ఆ పొగ పీల్చే ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే.. ప్రత్యూష ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఆమె స్నేహితులను అడగగా.. గత కొంతకాలంగా ప్రత్యూష డిప్రెషన్ లో ఉందని చెప్పినట్లు సమాచారం.
Top fashion designer Prathyusha Garimella was found dead at her residence in Banjara Hills, Telangana, says police
Police seized a carbon monoxide cylinder from her bedroom. A case is being registered under the section of suspicious death: Circle Inspector
(Image source: FB) pic.twitter.com/e3MetX6qKj
— ANI (@ANI) June 11, 2022
ఫ్యాషన్ ఇండస్ట్రీలో దాదాపు 9 ఏళ్లుగా కొనసాగుతున్న ప్రత్యూషకు పరిచయాలు, స్నేహితులు కూడా ఉన్నారని.. అలాగే కొంతకాలంగా తల్లిదండ్రులకు కూడా దూరంగా ఉంటోందని సమాచారం. ఇక తాజాగా ప్రత్యూష గదిలో సూసైడ్ నోట్ లభ్యమైనట్లు తెలుస్తుంది. ఆ సూసైడ్ నోట్ లో.. “నేను కోరుకున్న లైఫ్ ఇది కాదు.. నేనింకా మా పేరెంట్స్ కి భారం కాదల్చుకోలేదు.. నేను ప్రతిరోజూ ఏడుస్తున్నాను. పేరెంట్స్, ఫ్రెండ్స్, వెల్ విషర్స్ అందరూ క్షమించండి” అని ప్రత్యూష రాసినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు ప్రత్యూష మృతదేహానికి పోస్టుమార్టం కూడా పూర్తయినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం పోలీసులు ప్రత్యూష సన్నిహితులు, పేరెంట్స్ ని సంప్రదించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
డిజైనర్ ప్రత్యూష గరిమెళ్ళ సూసైడ్ నోట్ లో రాసింది ఇదే
This is not my wished life..!
I dont want to be burden to my parents..!
Every day iam crying
Sorry to my parents and all my friends and wellwishers..!
Prathyusha Garimella #pratyushadesigner #sucide #Tollywood pic.twitter.com/93ZwtrPdCL— Zee Telugu News (@ZeeTeluguLive) June 11, 2022