ఆమె చూస్తే స్టార్ హీరోలకు మించి ఎత్తుగా ఉంటుంది. హీరోయిన్ గా చేసిన ఫస్ట్ సినిమాతోనే సూపర్ హిట్ కొట్టేసింది. తాజాగా మరో క్రేజీ సినిమాతో థియేటర్లలోకి వచ్చేసింది. గుర్తుపట్టారా మరి?
ఆమె ఇప్పటివరకు పలు సినిమాలు చేసింది. కానీ హీరోయిన్ గా చేసిన తొలి చిత్రం ఈమెని ఓవర్ నైట్ స్టార్ ని చేసేసింది. చెప్పాలంటే అసలు పేరు కంటే మూవీలోని క్యారెక్టర్ పేరుతో చాలా ఫేమస్ అయింది. స్టార్ హీరోల దగ్గర నుంచి మిడ్ రేంజ్ హీరోల వరకు అందరినీ తలెత్తుకునేలా చేసింది, చేస్తోంది కూడా. రీసెంట్ గా ఓ డైరెక్టర్ ఈమె గురించి చెబుతూ.. తనని ఈ బ్యూటీ తలెత్తుకునేలా చేసిందని అన్నాడు. హీరోయిన్ అంటే యాక్టింగ్, డ్యాన్స్, గ్లామర్.. ఇలా అన్నీ ఉండాలి. ఈమెకు అవన్నీ ఫెర్ఫెక్ట్ గా ఉన్నాయి. ఇంతలా చెప్పాం కదా మరి ఆమె ఎవరో గుర్తుపట్టారా? లేదా చెప్పేయమంటారా?
ఇక వివరాల్లోకి వెళ్తే.. సాధారణంగా కామెడీ సినిమాలు అనగానే హీరోయిన్ పాత్రలకు పెద్దగా స్కోప్ ఉండదు. కానీ ‘జాతిరత్నాలు’ తీసుకంటే హీరోయిన్ ఫరియా అబ్దుల్లాకు మంచి క్యారెక్టర్ పడింది. లాయర్ చిట్టిగా సూపర్ ఫేమస్ అయిపోయింది. పైన ఫొటోలో కనిపిస్తున్న పాప ఫరియానే. లీడ్ రోల్స్ కు ఎంత పేరొచ్చిందో.. ఈమెకు కూడా అదే రేంజ్ లో ఫేమ్ వచ్చింది. ఫ్యాన్ ఫాలోయింగ్ అలానే సంపాదించుకుంది. అయితే ‘జాతిరత్నాలు’ చిత్రంలో హీరోయిన్ గా నటించి ఆకట్టుకున్న చిట్టి.. తాజాగా థియేటర్లలోకి వచ్చిన ‘రావణాసుర’లో మరోసారి లాయర్ గా నటించి ఎంటర్ టైన్ చేసింది. ఈ క్రమంలోనే ఆమె చిన్నప్పటి పిక్ ఒకటి వైరల్ గా మారింది.
చిట్టి అలియాస్ ఫరియా అబ్దుల్లా కెరీర్ చూసుకుంటే.. హైదరాబాద్ లో పుట్టి పెరిగిన ఈమె స్వతహాగా డ్యాన్సర్. 6 అడుగులకు మించి హైట్ ఉంటుంది. ఈ క్రమంలోనే తొలుత అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్’లో చిన్న గెస్ట్ రోల్ చేసింది. కానీ ఈ సినిమా తర్వాత స్టార్ట్ అయిన ‘జాతిరత్నాలు’ ముందు రిలీజైంది. సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. గతేడాది ‘బంగార్రాజు’, ‘లైక్ షేర్ సబ్ స్క్రైబ్’ మూవీస్ చేసింది. ఇప్పుడు రవితేజ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించింది. తమిళంలోనూ ‘వల్లి మాయిల్’ అనే సినిమా చేసింది. ఇలా సినిమాల పరంగా మిగతా హీరోయిన్లతో పోలిస్తే కాస్త స్లోగానే వెళ్తుందని చెప్పాలి. సరే ఇదంతా పక్కనబెడితే చిట్టి చిన్నప్పటి ఫొటో చూసి మీలో ఎంతమంది గుర్తుపట్టారు? కింద కామెంట్ చేయండి.