జాతి రత్నాలు చిత్రంతో ఒక్కసారిగా టాలీవుడ్‌లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయింది ఫరియా అబ్దుల్లా అలియాస్ చిట్టి. చిన్న చిత్రంగా విడుదలై భారీ విజయం అందుకున్న జాతిరత్నాలు మూవీలో చిట్టి పాత్రలో ఆమె ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రం భారీ విజయం తర్వాత చిట్టికి వరుస అవకాశాలు క్యూ కడతాయని అందరు భావించారు. అందుకు తగ్గట్టుగానే మంచి హైట్, చక్కటి లుక్ కూడా ఆ అమ్మడికి కలిసి వస్తాయి అనుకున్నారు. అయితే ఆ అంచనాలు తప్పాయి. వరుస పెట్టి అవకాశాలు రాలేదు.. వచ్చినవి కూడా ఆమెకు పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు.మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ చిత్రంలో గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చిన ఈ అమ్మడు తర్వాత నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించిన బంగార్రాజు చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్‌లో ఆడి పాడింది. ఇప్పుడు రావణాసుర చిత్రంలో నటిస్తోంది.
ఇక సినిమాల సంగతి అటుంచితే.. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటుంది. సందర్భం దొరికిన ప్రతి సారి తన డ్యాన్స్ వీడియోలతో అభిమానులను అలరిస్తుంది. ఈ క్రమంలో తాజాగా మరోసారి డ్యాన్స్ వీడియోతో ఇంటర్నెట్‌ని షేక్ చేస్తోంది చిట్టి. ఈ వీడియో చూసిన వారు.. వామ్మో నీలో ఈ యాంగిల్ కూడా ఉందా చిట్టి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇంతకు ఆ వీడియోలో ఏం ఉంది అంటే..
బెల్లీ డ్యాన్స్‌తో అదరగొట్టింది ఫరియా అబ్దుల్లా. ఆమె డ్యాన్స్ స్కిల్స్ చూసి నెటిజనులు ఆశ్చర్యపోతున్నారు. హైదరాబాద్‌లోని రంగ్ భూమి స్పేస్‌లో జరిగిన ఓ ఈవెంట్‌లో చిట్టి తన బెల్లీ డ్యాన్స్‌తో అందరి మతి పొగొట్టింది. క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో నెటిజనులు మతి పొగొట్టింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసి నెటిజనులు సో హాట్ అంటూ కామెంట్ చేసుత్న్నారు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.