గత కొన్నేళ్లుగా సీరియల్స్.. రాజ్యం ఏలుతున్నాయి. ఎవరు ఎంత తిట్టుకున్నా.. జీడిపాకంలా సాగుతాయి అని విమర్శించినా.. సీరియల్స్ హవా.. ఏమాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం ప్రతి చానెల్ రన్ అవుతుంది సీరియల్స్ వల్లనే అంటే అతిశయోక్తి కాదు. ప్రారంభంలో వారినికి ఒక ఎపిసోడ్ వచ్చేవి. ఇప్పుడు ధారావాహికలుగా ఏళ్ల తరబడి ప్రసారం అవుతున్నాయి. సీరియల్స్‌లో కూడా డబ్బింగ్, ఒరిజనల్ అనే తేడా లేదు. ఇక సీరియల్ ప్రేక్షకులకు కనెక్ట్ అయితే చాలు.. ఏళ్ల పాటు.. అలా సాగుతూనే ఉంటేంది. సదరు సీరియల్ మీద ప్రేక్షకులకు విరక్తి కలిగి.. రేటింగ్ పడిపోతే తప్ప.. అంత తొందరగా శుభం కార్డు పడదు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే.. సుమారు ఆరేళ్ల పాటు.. బుల్లితెరని నిర్విరామంగా ఏలిన కార్తీకదీపం సీరియల్ ఈ వారంతో ముగిసిపోతుంది. కార్తీకదీపం సీరియల్ అయిపోతుందని.. ఇప్పటికే సీరియల్ బృందం ప్రకటించింది. అందరికీ నచ్చే క్లైమాక్స్‌తో సీరియల్‌కు ముగింపు పలకబోతున్నట్లు వెల్లడించింది..
ఈ క్రమంలో స్టార్ మాలో ఆదివారం ప్రసారం అయ్యే స్టార్ మా పరివార్ ప్రొగ్రామ్‌లో కార్తీకదీపం సీరియల్‌కు ఫేర్‌వెల్ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కార్తీక దీపం సీరియల్ మెయిన్ క్యారెక్టర్లు అందరూ పాల్గొన్నారు. పరిటాల నిరుపమ్, ప్రేమీ విశ్వనాథ్, పిల్లలు శౌర్య, హిమ, సౌందర్య అందరూ వచ్చారు. వీరికి ఘనంగా సన్మానం చేసి.. గ్రాండ్‌గా ఫేర్‌వెల్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో వైరలవుతోంది.
ఇక ఈ ప్రోమోలో డాక్టర్ బాబు, దీప కలిసి డాన్స్ చేసి.. అందరిని ఆకట్టుకున్నారు. “ఇప్పుడే కుట్టింది చీమ.. డాక్టర్ బాబు అంటే నాకు ప్రేమ” అంటూ కవిత్వం చెప్పి.. వంటలక్క సూపర్బ్ అనిపించుకుంది. ఇక ఈ సీరియల్ ముగిసిపోతుంది అంటే కాస్త బాధగా ఉందని నిరుపమ్ ఎమోషనల్ అయ్యాడు. తర్వాత ప్రేక్షకులు అందరూ కలిసి డాక్టర్ బాబు రీల్ ఫ్యామిలీకి గజమాల వేసి సత్కరించారు.
చివరగా వంటలక్క కార్తీక దీపం సీరియల్ గురించి ఎమోషనల్ అవుతూ.. డాక్టర్ బాబుకి ప్రేమగా ముద్దు పెట్టి ఏడ్చేసింది. అయితే ఈ ప్రోమోలో చూపించిన సీన్ గతంలో వచ్చిన సీరియల్ ఎపిసోడ్‌లో ఆల్రేడీ చూపించారు. అదే సీన్‌ని మళ్లీ స్టేజ్ మీద నటించినట్టుగా అనిపిస్తుంది. ఏది ఏమైనా ఏళ్ల పాటు ప్రేక్షకులను అలరించింది కార్తీక దీపం సీరియల్.
ఒకప్పుడు స్టార్ హీరోలకు మించిన రేటింగ్‌లతో.. స్టార్ మాలో నంబర్ వన్ సీరియల్‌గా నిలిచింది కార్తీకదీపం సీరియల్. దీపగా నటించిన ప్రేమీ విశ్వనాథ్.. తెలుగమ్మాయి అయిపోయింది. ఈ సీరియల్‌లో ఉన్న బ్యూటీ ఏంటంటే.. అత్త క్యారెక్టర్. సాధారణంగా సీరియల్స్ అంటే.. అత్తలు.. కోడళ్లను రాచి రంపాన పెడతారు. కానీ ఈ కార్తీకదీపం సీరియల్‌లో మాత్రం.. అత్త సౌందర్య పాత్ర.. కొడుకుకన్నా ఎక్కువగా కోడలిని ప్రేమిస్తుంది.. నమ్ముతుంది.. ఆమెకు అండగా నిలబడుతుంది. ఈ పాత్ర ద్వారా సౌందర్య కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక లేడీ విలన్ మోనిత, పిల్లలు హిమ, శౌర్య.. తమ పాత్రల ద్వారా ప్రేక్షకుల మదిలో చిర స్థాయిగా నిలిచిపోయారు. మరి కార్తీక దీపం సీరియల్‌పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.