హీరోయిన్స్‌కు గుడి కట్టి పూజించటం ఈ నాటిది కాదు. దాదాపు దశాబ్ధాలుగా జరుగుతోంది. హీరోయిన్స్‌కు గుడి కట్టే సంప్రదాయం తమిళనాడు నుంచి మొదలైంది. ప్రముఖ సీనియర్ నటి ఖుష్భూకు తమిళనాడులో మొదటి సారి గుడికట్టారు. ఆ తర్వాత హీరోయిన్ నమితకు కూడా గుడి కట్టారు. తమిళ సోదరులకు సినిమా వాళ్లంటే ఓ పిచ్చి ఉంటుంది. హీరో, హీరోయిన్స్‌ను ఓ చిన్న సైజు దేవుళ్లుగా భావిస్తుంటారు. అందుకే ఇవన్నీ చేస్తుంటారు. తాజాగా, కొంతమంది అభిమానులు నటి యషికా ఆనంద్ ఫొటోలకు హారతి ఇచ్చి, పూజ చేశారు. ఆమెను ఓ దేవతలా చూస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. యషికా వీటిపై స్వయంగా స్పందించారు.
తాను కేవలం మనిషిని మాత్రమేనని, నిజమైన దేవుళ్లను పూజించమని ఆమె తన ఫ్యాన్స్‌కు సలహా ఇచ్చారు. ఇంతకీ సంగతేంటంటే.. నటి యషికకు ఇన్‌స్టాగ్రామ్‌లో ‘డెవోటీ ఆఫ్ యషిక’’ అనే ఫ్యాన్ పేజీ ఉంది. అందులో దాదాపు 900 మంది ఫ్యాన్స్ ఉన్నారు. వారితో పాటు యషిక కూడా అందులో ఉంది. ఫ్యాన్స్ ఆమె గురించి పెట్టే పోస్టులకు స్వయంగా ఆమే రిప్లై ఇస్తూ ఉంటుంది. తాజాగా, కొంతమంది యషిక ఫ్యాన్స్ ఆమె ఫొటోలకు హారతులు ఇస్తూ.. మొక్కుతూ దేవతలా పూజించటం మొదలుపెట్టారు.
ఆ ఫొటోలు, వీడియోలను ఫ్యాన్ పేజీలో పోస్టు చేశారు. వాటిపై యషిక సంతోషం వ్యక్తం చేశారు. నిజమైన దేవుళ్లకు మాత్రమే పూజలు చేయండని విజ‍్క్షప్తి చేశారు. కాగా, నటి యషిక కవలై వేండాం అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. మొదట్లో చిన్న చిన్న పాత్రలు చేసేవారు. ఇప్పుడు సెకండ్ హీరోయిన్ లాంటి పాత్రలు చేస్తున్నారు. తమిళ నాట మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మరి, యషికను దేవతలా పూజిస్తున్న ఈ ఫ్యాన్స్‌పై మీఅభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.