హీరోలకు బలం, బలహీనత అభిమానులే. వారు లేకపోతే హీరోలు లేరు. కానీ అభిమానులు చూపించే అత్యుత్సాహం వల్ల.. కొన్నిసార్లు గొడవలు, తన్నుకోవడం వంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. తాజాగా తమిళనాడులో ఇదే పరిస్థితి కనిపించింది. మన దగ్గర, తమిళనాట.. పొంగల్ సందర్భంగా.. స్టార్ హీరోల చిత్రాలు విడుదల అవుతుంటాయి. మన దగ్గర సంక్రాంతి సందర్భంగా చిరంజీవి, బాలకృష్ణల సినిమాలు వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి ప్రేక్షకులు ముందుకు వస్తున్నాయి. ఇక తమిళనాడులో పొంగల్ సందర్భంగా విజయ్ వారీసు, అజిత్ తెగింపు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత ఈ ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు ఒకే రోజున ప్రేక్షకుల ముందుకు రావడంతో.. థియేటర్ల దగ్గర యుద్ధ వాతావరణం నెలకొంది.
అజిత్, విజయ్ ఇద్దరూ కోలీవుడ్‌లో స్టార్ హీరోలు మాత్రమే కాక.. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్లు. వీరి మధ్య ఎలాంటి విబేధాలు లేనప్పటికి.. ఈ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ మాత్రం.. ఢీ అంటే ఢీ అన్నట్లు ఉంటారు. సోషల్ మీడియా వేదికగా ఇరువురు హీరోల అభిమానుల మధ్య మాటల యుద్ధం సాగుతూనే ఉంటుంది. ఇక ఈ హీరోల సినిమాల విడుదల సమయంలో మాటల యుద్ధం కాస్త.. చేతల్లోకి మారుతుంది. అలాంటిది ఈ సారి ఈ ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు ఒకే రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. దాంతో పలు థియేటర్ల వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
దాదాపు 9 సంవత్సరాల తర్వాత ఈ స్టార్ హీరోలిద్దరి సినిమాలు ఒకే రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇక సినిమాల విడుదలకు ముందు నుంచే.. ఇద్దరు హీరోల అభిమానులు మాటల యుద్ధం స్టార్ట్ చేశారు. సినిమాల విడుదల రోజు ఏకంగా కొట్టుకున్నారు వీరి పోట్లాట వల్ల థియేటర్ యజమానులకు పెద్ద చిక్కు వచ్చి పడింది. ఈ ఇద్దరు స్టార్ హీరోల కోసం థియేటర్లు సర్దుబాటు చెయ్యలేక నానా అవస్థలు పడుతున్నారు. దాదాపు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని మల్టీప్లెక్సులు, సింగిల్ స్క్రీన్స్ అన్నీ కూడా ఈ రెండు సినిమాలతోనే నిండిపోయాయి.
అజిత్ సినిమా తెగింపు జనవరి 11న తెల్లవారుజామున 1 గంటకే ప్రీమియర్ షో వేశారు. అభిమానులు రాత్రంతా థియేటర్స్ దగ్గర డ్యాన్స్, డీజే, ఇక పూల దండలు, పాలాభిషేకాలు, కటౌట్లు, బ్యానర్లతో సందడి చేశారు. ఈక్రమంలో చెన్నైలో థియేటర్ వద్ద ఈ ఇద్దరు హీరోల అభిమానులు గొడపవడ్డారు. అజిత్ ఫ్యాన్స్.. విజయ్ సినిమా పోస్టర్లను చించేయగా.. విజయ్ ఫ్యాన్స్.. అజిత్ సినిమా పోస్టర్లను చించేశారు. అలానే మరో థియేటర్ వద్ద స్క్రీన్స్ కేటాయించే విషయంలో అజిత్ – విజయ్ ఫ్యాన్స్ మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది.
ఈ థియేటర్‌లో మొత్తం మూడు స్క్రీన్స్ ఉండగా.. మొదటి స్క్రీన్ అజిత్ సినిమాకు.. రెండోవ స్క్రీన్ విజయ్ సినిమాకు కేటాయించారు. ఇక మూడో స్క్రీన్ కోసం ఇద్దరు హీరోల అభిమానుల మధ్య గొడవ జరిగింది. ఆ స్క్రీన్‌ని మా హీరోకి ఇవ్వాలంటే మా హీరోకి ఇవ్వాలంటూ ఇద్దరు హీరోల అభిమానులు గొడవ ప్రారంభించారు. దాంతో థియేటర్ ఓనర్స్ రంగంలోకి దిగి.. ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చారు. టాస్ వేసి స్క్రీన్ సెలెక్ట్ చేశారు. అజిత్ ఫ్యాన్స్ టాస్ గెలవడంతో తెగింపుకే మూడో స్క్రీన్ ఇవ్వాలని నిర్ణయించి గొడవ సద్ధుమణిగేలా చూశారు. మరి హీరోల కోసం అభిమానులు ఇలా కొట్టుకోవడం కరెక్టేనా.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#WATCH | Tamil Nadu: Fans of Ajith Kumar tore posters of Vijay starrer #Varisu & fans of Vijay tore posters of Ajith Kumar starrer #Thunivu outside a movie theatre in Chennai
Both films have released on the same day after 8 yrs, people gathered in large numbers to watch them. pic.twitter.com/rahM76Gcjk
— ANI (@ANI) January 11, 2023