చావు ఇళ్ల దగ్గర కూడా అభిమానులు సినిమా వాళ్లను సెల్ఫీల కోసం వేధిస్తున్నారు. సెలెబ్రిటీలు అంటే పబ్లిక్ ప్రాపర్టీల ఫీలవుతూ.. వారిని ఇబ్బంది పెడుతున్నారు. సెల్ఫీలు ఇవ్వకపోతే సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
సినిమా వాళ్ల పర్సనల్ లైఫ్ ఎప్పుడో వాళ్ల చెయ్యి దాటి పోయింది. వాళ్లకు సంబంధించిన ఏ చిన్న విషయమైనా పబ్లిక్ ఇష్యూ లాగా మారిపోతోంది. సెలెబ్రిటీ ప్రైవేట్ లైఫ్ ఒకరకంగా జనం చేతుల్లోకి వెళ్లిపోయింది. బయటకు వచ్చారంటే చాలు తమకు నచ్చినట్లు ఉండాలని జనం భావిస్తూ ఉన్నారు. ఏ చిన్న తేడా అనిపించినా దాన్ని సోషల్ మీడియాలో పెట్టి విమర్శించటం చేస్తున్నారు. ఆఖరికి సెలెబ్రిటీ నవ్వులను, ఏడుపును కూడా జనం ప్రభావితం చేస్తున్నారు. వారి మూడ్‌తో సంబంధం లేకుండా ఫొటోలు దిగటానికి ఎగబడుతున్నారు. ఆఖరికి చావు ఇళ్లకు వెళ్లిన వారిని కూడా వదలటం లేదు. తాజాగా, మాయిల్‌సామి అంత్యక్రియల సందర్భంగా కూడా ఇదే జరిగింది. మాయిల్‌సామి చివరి చూపుకు వచ్చిన సినీ సెలెబ్రిటీలతో ఫొటోలు దిగటానికి కొంత మంది అభిమానులు అత్యుత్సాహపడ్డారు.
దీంతో సెలెబ్రిటీలు అసహనం వ్యక్తం చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ప్రముఖ తమిళ నటుడు మాయిల్‌సామి ఆదివారం తెల్లవారు జామున గుండెపోటు కారణంగా చనిపోయారు. ఆయన భౌతికదేహాన్ని అంత్యక్రియల కోసం చెన్నైలోని ఆయన ఇంటి వద్ద ఉంచారు. సినీ, రాజకీయ ప్రముఖులు మాయిల్‌సామి భౌతికదేహాన్ని సందర్శించటానికి వచ్చారు. వీరిలో హీరో రజినీకాంత్, కార్తీ, నటుడు సూరీ తదితరులు ఉన్నారు. వీరిని చూసిన కొంతమంది అభిమానులు అత్యుత్సాహం చూపారు. సెల్ఫీల కోసం వారిని ఇబ్బంది పెట్టారు. దీంతో చావు ఇంట సెల్ఫీలు ఏంట్రా అని సెలెబ్రిటీలు అసహనం వ్యక్తం చేశారు.
అభిమానుల్ని ఏమీ అనలేక, సున్నితంగా నో చెప్పి ముందుకు కదిలారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా, మాయిల్‌సామి కడసారి చూపుకోసం సూపర్‌స్టార్ రజినీకాంత్ వెళ్లారు. ఈ సందర్భంగా మాయిల్‌సామితో ఉన్న అనుబంధాన్ని చెప్పుకొచ్చారు. దాదాపు 30 ఏళ్లుగా మాయిల్‌సామి తెలుసునని అన్నారు. మిమిక్రీ ఆర్టిస్ట్‌నుంచి నటుడిగా ఎదిగారని అన్నారు. ఆయన చివరి కోరికను తీరుస్తానని రజినీకాంత్ మాట ఇచ్చారు. మరి, చావు ఇంటి వద్ద అభిమానులు సెల్ఫీల కోసం ఎగబడ్డంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.