వైరల్‌ వీడియో: ఆదిపురుష్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఫ్యాన్స్‌ మధ్య వార్‌

ప్రభాస్‌ నటించిన ఆదిపురుష్‌ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ సందర్భంగా ఫ్యాన్స్‌ మధ్య గొడవ చోటుచేసుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

  • Written By:
  • Publish Date - June 7, 2023 / 01:56 PM IST

మంగళవారం తిరుపతిలో ఆదిపురుష్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ భారీ స్థాయిలో జరిగింది. ఫ్యాన్స్‌ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దాదాపు లక్ష మంది దాకా ఈ ఈవెంట్‌లో పాల్గొని ఉంటారని అంచనా. తమ అభిమాన హీరోను చూడ్డానికి రెండు తెలుగు రాష్ట్రాలనుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్‌ తరలివచ్చారు. భారీ వర్షం కురుస్తున్నా.. ఫ్యాన్స్‌ అక్కడినుంచి పక్కకు కదల్లేదు. ప్రభాస్‌ కోసం అక్కడే ఉండిపోయారు. ఈవెంట్‌ సందర్భంగా ప్రభాస్‌ ఫ్యాన్స్‌ మధ్య గొడవ చోటుచేసుకుంది. ఈ గొడవకు కారణం ఏంటి? ఎందుకు కొట్టుకున్నారు అన్న దానిపై క్లారిటీ లేదు.

కానీ, గొడవకు సంబంధించిన ఓ వీడియో మాత్రం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియోలో గ్రీన్‌ కలర్‌ టీషర్టు ధరించిన వ్యక్తిపై ముగ్గురు వ్యక్తులు మాటల్తో విరుచుకుపడ్డారు. తర్వాత ఓ వ్యక్తి.. గ్రీన్‌ కలర్‌ షర్టు వ్యక్తిపై దాడికి దిగాడు. చేత్తో ఫటాఫటా పీకాడు. పక్కనున్న వాళ్లు అతడ్ని వారించటంతో ఆగిపోయాడు. లేదంటే గొడవ మరింత ముదిరేది. కాగా, ఆదిపురుష్‌ సినిమా జూన్‌ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు సంబంధించి థియట్రికల్‌ రైట్స్‌తో పాటు ఓటీటీ రైట్స్‌ భారీ మొత్తానికి అమ్ముడయ్యాయి.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన థియట్రికల్‌ రైట్స్‌ 170 కోట్ల రూపాయలకు పైగా అమ్ముడయినట్లు సమాచారం. ఇక, ఓటీటీ రైట్స్‌ విషయానికి వస్తే.. 250 కోట్ల రూపాయలకు ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ ఈరైట్స్‌ కొన్నట్లు తెలుస్తోంది. విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తున్న ఈ సినిమా విడుదల తర్వాత ఇంకెలాంటి రికార్డులు క్రియేట్‌ చేస్తుందో వేచి చూడాల్సిందే. మరి, ఆదిపురుష్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఫ్యాన్స్‌ కొట్టుకోవటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments
SHARE THIS ARTICLE ON
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Most viewed