Punch Prasad: స్టార్ హీరోలైనా.. హాస్య నటులైనా వారి అభిమానుల దృష్టిలో వారిది ఓ ప్రత్యేక స్థానం. తమ అభిమాన నటుడిపై కల్మషం లేని ప్రేమను చూపిస్తుంటారు. వారికి ఏం జరిగినా తెగ బాధపడిపోతుంటారు. సహాయం చేయటానికి కూడా చూస్తారు.. అది ఎంత కష్టమైనా సరే.. ఓ అభిమాని తనకు ఇష్టమైన ఓ హాస్య నటుడిపై కొండంత అభిమానం, ప్రేమ ఉందని నిరూపించాడు. ఇందుకు ‘‘ శ్రీదేవీ డ్రామా కంపెనీ’’ షో వేదికగా మారింది. ఈ షో సాక్షిగా కిడ్నీ సంబంధమైన సమస్యతో బాధపడుతున్న బబర్ధస్త్ హాస్య నటుడు పంచ్ ప్రసాద్‌కు తన కిడ్నీ ఇస్తానన్నాడు ఓ అభిమాని. వీడియో ద్వారా ఆ అభిమాని మాట్లాడుతూ.. ‘‘ప్రసాద్ అన్న నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్‌ను. మీరు ఒంటరిగా ఉన్నపుడు.. మీ ప్రాబ్లమ్‌ను తల్చుకుని మీరెప్పుడైనా బాధపడ్డారా?..మీకు నిజంగా అవసరమైతే నా కిడ్నీ ఇవ్వటానికైనా నేను రెడీ అన్న’’ అంటూ తన అభిమానాన్ని చాటుకున్నాడు.
దీంతో ఎమోషనల్ అయిన ప్రసాద్ ‘‘ ఏ రోజూ నాకీ ప్రాబ్లమ్ ఉందని బాధపడలేదు. ఒంటరిగా ఉన్నపుడు కూడా నేను దీని గురించి ఆలోచించను. ఇది విన్న తర్వాత నేను ఇప్పుడు ఫీలవుతున్నాను. నా కోసం కిడ్నీ ఇచ్చేంత అభిమానులు ఉన్నారా అని.. నేను దేవుడ్ని కోరుకునేదేంటంటే.. నాకింకొన్నాళ్లు మిమ్మల్ని నవ్వించే లైఫ్ స్పాన్ ఇవ్వాలని కోరుకుంటున్నాను’’ అంటూ అభిమాని ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించాడు. మరి, పంచ్ ప్రసాద్‌పై సదరు అభిమాని చూపిన ప్రేమ గురించి మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Liger Movie: లైగర్ మూవీ నుంచి క్రేజీ అప్‌డేట్!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.