ఇష్టమైన హీరోను అభిమానులు గుండెల్లో పెట్టి చూసుకుంటారు. ఆయన సినిమా విడుదల అయ్యిందంటే చాలు సందడంతా ఆ అభిమానులదే. సొంత డబ్బులతో తమ అభిమాన హీరో కోసం కార్యక్రమాలు చేస్తుంటారు. కానీ కొందరు మాత్రం అభిమానాన్ని ప్రత్యేకంగా చాటుకుంటారు. అలాంటి వ్యక్తి విశాఖపట్నంకి చెందిన వెంకట్రావు. తాను అభిమానించే హీరో కోసం ఏకంగా విగ్రహం ఏర్పాటు చేశాడు.
సాధారణంగా సమాజంలో పేరు, ప్రఖ్యాతలు సంపాదించిన వారికి అభిమానులు ఉంటారు. ముఖ్యంగా సినీ, రాజకీయ ప్రముఖులకు ఫ్యాన్ ఫాలోయింగ్ కాస్తా ఎక్కువగా ఉంటుంది. ఇక హీరో, హీరోయిన్లపై.. వారి అభిమానులు చూపించే అప్యాయత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమ హీరో సినిమా వచ్చిందంటే చాలు వారికి పండగే. కొందరు తమ అభిమాన హీరో, హీరోయిన్లకు గుడి కట్టిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అయితే ఓ వ్యక్తి ఏకంగా ఇంట్లోనే తన అభిమాన హీరో విగ్రహం ఏర్పాటు చేశాడు. అంతేకాక ఆ హీరో జయంతి నాడు, వర్థంతి నాడు ప్రత్యేక పూజలు నిర్వహిస్తాడు. విశాఖపట్నం జిల్లా కు చెందిన వెంకట్రావు అనే వ్యక్తి.. తన హీరోపై ఉన్న అభిమానాన్ని ఇలా చాటుకున్నారు. మరి.. పూర్తి వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
విశాఖపట్నం లోని ఆర్పీపేటకు చెందిన వెంకట్రావుది సాధారణ మధ్య తరగతి కుటుంబం. ఆయన రోజూ ప్రైవేటు పనులు చేసుకుంటూ కుటుంబాన్నీ పోషిస్తున్నారు. అయకు చిన్నతనం నుంచి సినిమాలంటే బాగా ఇష్టం. అయితే పెరిగి పెద్దయ్యే సమయంలో హీరో శోభన్ బాబుపై ఇష్టం ఏర్పడింది. అలానే శోభన్ బాబుపై వెంకట్రావు ఎంతో అభిమానం పెంచుకున్నారు. ఆయన సినిమాలను నిత్యం చూస్తూ ఉండేవారు. ఆయన సినిమా విడుదలైతే.. తొలి రోజే థియేటర్ కి వెళ్లి సందడి చేసేవారు. ఇలా కేవలం సినిమాలు చూడటంతోనే తన అభిమానం ఆపలేదు. సిటీ వైడ్ శోభన్‌బాబు ఫ్యాన్స్ అసోసియేషన్‌ను ఏర్పాటు చేశారు. ఆ అసోసియేషన్ కి అధ్యక్షుడు కూడా అయ్యాడు.
1995లో ఒకసారి శోభన్‌బాబు విశాఖలోని వెంకట్రావు ఇంటికి వచ్చారు. అంతేకాక వెంకట్రావు ఇంట్లో ఓ రాత్రి బస చేయడం విశేషం. ఇక దూరం నుంచి తన అభిమాన హీరోను చూస్తే చాలు అనుకునే వెంకట్రావు ఇలా జరగడంతో ఆనందానికి అవధులు లేవు. ఆ తరువాత నుంచి వెంకట్రావు.. శోభన్‌బాబును కలిసేందుకు ఆయన ఇంటికి, సినిమాల షూటింగ్ జరిగే చోటికి వెళ్తుండేవారు. అలా వెంకట్రావుకు తెలియకుండానే.. ఆయనలో శోభన్‌బాబు అంటే పిచ్చ అభిమానం ఏర్పడింది. శోభన్‌బాబు మరణం సమయంలో వెంకట్రావు తీవ్ర వేదనకు గురయ్యారు. ఇక తన అభిమాన హీరో తిరిగి రాడనే వార్తను జీర్ణించుకోలేక పోయారు. అయినా తన అభిమాన హీరో.. తన కళ్లముందే కనిపించాలని భావించిన వెంకట్రావు ఓ నిర్ణయం తీసుకున్నారు.
తాను నివాసం ఉంటున్న ఇంటి ఆవరణలోని 20 గజాల స్థలంలో శోభన్‌బాబు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి ఏటా జనవరి 14న జయంతి.. అలాగే మార్చి 20న వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించేవారు. అలాగే శోభన్‌బాబు పేరిట కొన్ని సేవకార్యక్రామలు నిర్వహిస్తున్నారు. శోభన్‌బాబు చెప్పిని చివరి మాటలతో తాను స్ఫూర్తి పొందానని వెంకట్రావు తెలిపారు. తన ఇంట్లోనే శోభన్ బాబు విగ్రహం ఏర్పాటు చేసి.. ఆయన పేరిట సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని ఆయన అన్నారు. మరి.. ఓ హీరో విగ్రహాన్ని ఇంట్లో ఏర్పాటు చేసుకుని తన అభిమానం చూపిస్తున్న ఈ వ్యక్తిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.