కరోనా మొదలైనప్పటి నుంచి ఇండస్ట్రీలో విషాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత కూడా ఇండస్ట్రీలో విషాదాలు ఆగలేదు. తాజాగా టీవీ, వెండితెరపై ఒక వెలుగు వెలిగిన ప్రముఖ బాలీవుడ్ నటుడు సలీం గౌస్(70) కన్నుమూశారు. సలీంగౌస్ మృతితో ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సలీం గౌస్ కార్డియాక్ అరెస్ట్ కారణంగా మృతిచెందినట్లు ఆయన భార్య నిర్ధారించారు. గురువారం ఉదయం ముంబైలో సలీం గౌస్ అంత్యక్రియలు నిర్వహించారు. సలీం గౌస్ మృతిపట్ల అన్ని ఇండస్ట్రీల పెద్దలు, ప్రముఖులు నివాళులర్పించారు. సలీం గౌస్ కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు.
ఇదీ చదవండి: బ్రేకింగ్ న్యూస్! హీరో నిఖిల్ ఇంట విషాదం!
సలీం గౌస్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులే.. ఆయన హిందీ, తెలుగు, తమిళ్, మలయాళంతో పాటు ఇంగ్లీష్ సినిమాల్లోనూ నటించి మెప్పించారు. 1992లో అంతం అనే సినిమాతో టాలీవుడ్ లో అరంగేట్రం చేశారు. సలీం గౌస్ అడపాదడపా తెలుగు సినిమాలు చేస్తూ ఉండేవారు. కానీ, చిరంజీవితో చేసిన ముగ్గురు మొనగాళ్లు సినిమాలో ప్రతినాయకుడిగా సలీం గౌస్ కు మంచి గుర్తింపు లభించింది. ఆయన ది డిసీవర్స్, ది పర్ఫెక్ట్ మర్డర్ అనే రెండు ఆంగ్ల చిత్రాల్లో సైతం నటించారు. సలీం గౌస్ మృతిపట్ల కామెంట్స్ రూపంలో మీ సంతాపాన్ని తెలియజేయండి.
RIP, Salim Ghouse.
He acted in very few Tamil movies, but made massive impact both in his first & last.
In #Vettaikkaaran as ‘Vedhanayagam na bayam’ starring across Thalapathy.
An outrageous debut as ‘Zinda’ in #VetriVizha across Kamalsur! What a terrific villain intro scene! pic.twitter.com/UpnLAVqbq9
— Srini Mama (@SriniMama16) April 28, 2022
मैं पुत्र हूँ, तुम्हारा और तुम माता हो! #SalimGhouse #BharatEkKhoj https://t.co/kKUI0dKLPN pic.twitter.com/IVDM8g1eqs
— Kavishala (@kavishala) April 28, 2022