‘ఏమాయ చేసావే’తో తెలుగు తెరకు పరిచయమై అందరినీ మాయ చేసిన సమంత.. అప్పటి నుంచి అగ్రశ్రేణి హీరోయిన్‌గా కొనసాగుతోంది. అక్కినేని కోడలు ప్రస్తుంతం కెరీర్‌కు కొంత బ్రేక్ ఇచ్చింది. మొన్నటివరకు మిత్రులతో కలిసి గోవాలో ఎంజాయ్ చేసింది సమంత. ప్రస్తుతం తిరుమల పర్యటనలో ఉన్న సమంత తిరుమల శ్రీవారిని దర్శించుకున్న విషయం తెలిసిందే. తర్వాత శ్రీకాళహస్తీశ్వరాలయాన్ని దర్శించుకుంది. ఆలయ అధికారులు సమంతతో ప్రత్యేక అభిషేక పూజలు చేయించారు. అనంతరం దక్షిణ మూర్తి వద్ద వేద పండితులు సమంతను ప్రత్యేకంగా ఆశీర్వాధించారు. సమంతకు స్వామి అమ్మవార్ల తీర్థప్రసాదాలు అందించారు.