గత కొంత కాలంగా సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖ నటులు, దర్శక, నిర్మాతలు.. ఇతర సాంకేతిక వర్గానికి చెందిన వారు కన్నుమూయడంతో ఇండస్ట్రీలో విషాదం నెలకొంటుంది. ఇటీవల ప్రముఖ హీరోయిన్ మీనా భర్త విద్యాసాగర్ మరణించగా.. టాలీవుడ్ లో ప్రముఖ ఎడిటర్ గౌతంరాజు మరణించారు. ఈ విషాదం మరువక ముందే.. తెలుగు ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది.
తెలుగు ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ గా పేరు తెచ్చుకున్న గోరంట్ల రాజేంద్ర ప్రసాద్ కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో ఇబ్బందిపడుతోన్న ఆయన గురువారం ఉదయం తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గోరంట్ల రాజేంద్రప్రసాద్, రామానాయుడు ఇద్దరు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు తెలుగు ఇండస్ట్రీకి అందించారు.
మాధవి పిక్చర్స్ ఆయన సొంత బ్యానర్ లో పలు హిట్ చిత్రాలు నిర్మించి మంచి అభిరుచి ఉన్న నిర్మాతగా ఇండస్ట్రీలో పేరు సంపాదించారు. రాజేంద్రప్రసాద్ మరణంతో టాలీవుడ్ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. గోరంట్ల రాజేంద్రప్రసాద్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
TDP founder anna NT Rama Rao on his way to MLA Quarters to announce the launch of TDP party in Hyderabad on March 29, 1982.
Gorantla Rajendra Prasad,
My younger brother(red arrow) #గోరంట్ల#జోహార్_అన్న_ఎన్టీఆర్#జై_తెలుగుదేశం#Gorantla_SinceDay1TDP @JaiTDP @iTDP_Official pic.twitter.com/RgbIQXdlAv— Gorantla butchaiah choudary (@GORANTLA_BC) March 29, 2022