సిరి వెన్నెల సీతారామశాస్త్రి.. తెలుగు సినీ సాహితీ గగనాన విరజిమ్మిన ఒక కిరణం, బరువెక్కిన హృదయాలకు ఆయన పాటే సరైన వైద్యం, మనషి పూర్తి జీవిత చక్రాన్ని ఎప్పుడో రాసేసింది అయన కలం. అలాంటి మహానుబావుడు నేడు మనందరిని వదిలి, తిరిగిరాని లోకాలకి పయనం అవ్వడం నిజంగా తెలుగు సాహిత్యం చేసుకున్న దురదృష్టం. ఈ నేపధ్యంలో సిరివెన్నెల మనకి పంచిపోయిన జ్ఞాపకాలను ఓ సారి గుర్తు చేసుకుందాం.
సిరివెన్నెల సీతారామశాస్త్రి విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లి మండలంలో శ్రీ డా.సి.వి.యోగి, శ్రీమతి సుబ్బలక్ష్మి గార్లకు మే 20, 1955వ తేదీన జన్మించారు. సీతారామశాస్త్రి విద్యాభ్యాసం పదవ తరగతి వరకు అనకాపల్లిలో జరిగింది. ఆ తరువాత కాకినాడలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. ఆంధ్ర విశ్వకళా పరిషత్ లో బి.ఎ పూర్తి చేసి ఎం.ఏలో జాయిన్ అయ్యారు. అయితే.. ఆయన ఎం.ఏ చేస్తుండగానే.. కళాతపస్వి కె.విశ్వనాథ్ తన సినిమాలో సీతారామశాస్త్రికి పాట రాసే అవకాశం కల్పించారు.
ఇలా తన మొదటి పాటతోనే విదాత మదిలో కళామతల్లి ముద్దు బిడ్డగా మారిన సిరివెన్నెల.. స్వయం కృషితోనే పైకి వస్తూ, ఆకాశంలోని ఆశల హరివిల్లుని ఆహ్వానించారు. మరో వైపు క్లాసు రూంలో తపస్సు చేసే యువతని.. సమాజంలోని నిజాలను బయటకి వచ్చి చూడమని చెబుతూ.. బోటని క్లాస్ కి , మ్యాటని అట కి లింక్ పెట్టిన రచయత ఆయన.
చక్రవర్తికి , వీది బిచ్చగెత్తకి మనీని కామన్ రిలేటివ్ చేసిన ఘనుడు ఆయనే. అర్ద శతాబ్దపు అజ్ఞాన్ని స్వాత్రంతమని ఎలా అంటామని ప్రశ్నలు సంధించిన ఆయన కలం తీరుని ఎవరు మాత్రం మరచిపోగలరు. ఆయన పాట కొమ్మల్లో కుకులు పలికే కోయలమ్మలకి బాగా తెలుసు. అందుకే అవి ఉండే కొండల మధ్య ఆ పాటల యొక్క యకోలు ఎప్పుడు ధ్వనిస్తూనే ఉంటాయి. ఇలా జగమంత కుటుంబంలో కష్ట సుఖాలను, బాధర బందీలను తనసాహిత్యంతో సృసిస్తూ.. జగమంతా నా కుటుంబం అనుకుంటూ.. సిరివెన్నెల సీతారామశాస్త్రి నిరంతరం ఒక సాహితి శ్రామికుడై శ్రమిస్తూనే వచ్చారు.
పాట తప్ప, సీతారామశాస్త్రికి… వేరే స్వరూపం లేదు, సారూప్యం లేదు. ఒకర్ని ఒక మాట అనడు,అననివ్వడు.‘మీరు గ్రేట్ సర్ ’ అంటే ఒప్పుకోడు. తనలోని జగమంత కుటుంబాన్ని చూపిస్తాడు. అందులో ఆయన తప్ప అంతా గ్రేట్గా కనిపించేలా చేస్తాడు! జీవితాన్ని, జీవితంలోని ప్రేమను, కవిని, కవి డిగ్నిటీని కళ్లకద్దుకుంటూ మాత్రమే తను కనిపిస్తాడు. మరెలా ఆయన్ని క్యాచ్ చెయ్యడం? ఇందుకే ఆయన మాటలకి అందని పాటల మహర్షి అయ్యారు.
చిన్నప్పుడు గవర్నమెంట్ బడిలో చదువు. చుట్టూ అమాయకత్వం. తనలో కూడా అదే అమాయకత్వం. ఇలాంటి పరిస్థితుల్లో పెరిగిన సీతారామశాస్త్రికి రాయడం అనే ఒక ప్రక్రియ ఉంటుందని, రాస్తారని ఎలా తెలుస్తుంది? కానీ.. నిత్యం ఏదో రాస్తూ ఉండేవారు. తను రాస్తున్నది కవిత్వం అని ఓ రోజు తమ్ముడు చెబితే కాని ఆయనకి అర్థంకాలేదు.
కేవలం ఒక సినిమా పాటలు రాసిన మాములు కవిగా సిరివెన్నెలని చూడలేము. 3 గంటల సినిమాలో 5 నిముషాలు వినిపించే ఆయన పాటని ఒక్కసారి వింటే మనలోని నిరుత్సాహం మనకి తెలీకుండానే మాయం అవుతుంది. ఎప్పుడు ఒప్పుకోకు రా ఓటమిని అని ఆయన రాసిన ప్రతి పాట మనకి దైర్యాన్ని అందిస్తునే ఉంటుంది. దుఃఖ సాగరంలో మునిగిన మనిషి మనసుకి సైతం సిరివెన్నెల పాట ప్రశాంతతని, దైర్యాన్ని ఇవ్వగలదు.
నీ ప్రశ్నలు నీవే ఎవ్వరు బొదులివ్వరు, అంటూ మనిషిలో ఉత్సాహాన్ని నింపే సిరివెన్నల పాట.. పుట్టుక, చావు నీకు సొంతం కావు అంటూ గొప్ప జీవిత సత్యాన్ని చాల సింపుల్ చెప్పేసింది. మొత్తంగా సాయంత్రం వేళలో సాగర కెరటాల మీద నుండి చల్లని గాలి వచ్చి తాకుతుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఈ సంగీత సాగరుని సాహిత్యాన్ని వింటున్నా మనసు అంతే ప్రశాంతంగా ఉంటుంది. అలాంటి పాటల తోటమాలి సిరివెన్నెల సీతారామశాస్త్రి ఈరోజు మన మధ్య లేకపోవడం నిజంగా మనం దురదృష్టం. సిరివెన్నెల కెరీర్ లో మొత్తం 11 నందులు, నాలుగు ఫిలిం ఫేర్ అవార్డులు లభించాయి. ఇక 2019 లో ఆయనకి పద్మ శ్రీ లభించడం విశేషం. ఏదేమైనా.. సిరివెన్నెల మృతి మాత్రం తెలుగు సినీ సాహితీ లోకానికి తీరని లోటు అని చెప్పుకోవచ్చు. మరి.. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.