ఇప్పుడు టాలీవుడ్, తెలుగు రాష్ట్రాల అంతటా ఎక్కడ చూసినా నాగచైతన్య- సమంత విడాకుల విషయమే వినిపిస్తోంది. ప్రత్యేకంగా వీరి విడాకుల అంశంలో ఫ్యాషన్ డిజైనర్.. సమంత వ్యక్తిగత డిజైనర్ ప్రీతమ్ జుకల్కర్ పేరు బాగా వినిపిస్తోంది. కొందరైతే అతని వల్లే నాగచైతన్య- సమంత విడాకులు తీసుకుంటున్నారు అనే వాదన కూడా వినిపిస్తోంది. ఒకప్పుడు ప్రీతమ్ జుకల్కర్ పుట్టినరోజు సందర్భంగా సమంత షేర్ చేసిన ఫొటో వల్లే ఇప్పుడు ఈ రచ్చ నడుస్తోందని కొందరు వాదిస్తున్నారు. ఏది ఏమైనా ఇప్పుడు ప్రీతమ్ జుకల్కర్‌కు మాత్రం టార్చర్ తప్పడంలేదు. అప్పట్లోనూ అక్కినేని అభిమానుల నుంచి ప్రీతమ్‌కు చుక్కలు చూపించారు. అప్పుడు వారి దెబ్బకు కామెంట్‌లను డిసేబుల్ చేశాడు ప్రీతమ్ జుకలక్కర్.
మరోసారి ఇప్పుడు ప్రీతమ్‌కు అదే పరిస్థితి వచ్చింది. గతంలోనూ అభిమానుల ధాటికి హడలిపోయిన ప్రీతమ్ జుకల్కర్ ఇప్పుడు కూడా అదేలా కనిపిస్తున్నాడు. కొంత వరకు ఎదురు దాడి చేసేందుకు ప్రయత్నించినా.. కామెంట్లు చేసే వారికి సమాధానం చెప్పలేకపోతున్నాడు. మీడియా సైతం అనుమానాలు వ్యక్తం చేస్తూ పలు కథనాలు రాయడంతో ఇంక నన్ను కాపాండండో అంటూ ప్రీతమ్ జుకల్కర్ వేడుకోలు ప్రారంభించాడు. సోషల్ మీడియాలో ప్రీతమ్‌ను తిడుతూ సమంతతో ఉన్న పాత ఫొటోలను షేర్ చేయడం మొదలు పెట్టారు. అంతా నువ్వే చేశావు అనే విధంగా ప్రీతమ్‌ను తప్పుబట్టడం ప్రారంభించారు. వారి బాధ తట్టుకోలేక వారిని వెంటనే బ్లాక్ చేయండి. వారి అకౌంట్లను రిపోర్టు చేయండి అంటూ తన అభిమానులకు సూచించాడు. అతని ఇన్‌స్టా పేజ్‌లో స్టోరీలో వారి అకౌంట్ డీటెయిల్స్‌ను షేర్ చేశాడు. నాగచైతన్య- సమంత విడాకుల అంశంలోకి ప్రీతమ్ జుకల్కర్‌ను లాగడం సరైందేనంటారా? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: ఎవరీ ప్రీతమ్ జుకల్కర్.. సమంతతో అతనికి ఎలా పరిచయం ఏర్పడింది?