సినిమా ఇండస్ట్రీలో విషాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస మూర్తి కాలం చేశారు. చెన్నైలో ఆయన తుదిశ్వాస విడిచారు. ప్రమాదవశాత్తు బిల్డింగ్ పై నుంచి కిందపడి శ్రీనివాస మూర్తి చనిపోయారు. ఆయన తమిళ, తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులు. డబ్బింగ్ రంగంలో ఎన్నో ఏళ్లుగా సేవలందిస్తున్నారు. ఆయన తెలుగులో సూర్యా, అజిత్, మోహన్ లాల్, రాజశేఖర్, విక్రమ్ ఇలా ఎంతో మంది స్టార్ హీరోలకు తెలుగులో డబ్బింగ్ చెప్పారు. ఈయన ఎన్నో సినిమాల్లో చేసినప్పటికీ పెద్దగా ప్రాచుర్యంలోకి రాలేదు. సుమన్ టీవీ చేసిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూతో శ్రీనివాస మూర్తి గురించి తెలుగు ప్రేక్షకులకు తెలిసింది.
శ్రీనివాస మూర్తిలాంటి గొప్ప డబ్బింగ్ ఆర్టిస్ట్ కోల్పోవండపై తెలుగు, తమిళ ఇండస్ట్రీలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. ఆయన ఎన్నో గొప్ప చిత్రాలకు, పెద్ద పెద్ద స్టార్లకు తన గాత్రాన్ని అందించారు. ఆయన చిన్న వయసులోనే చనిపోవడం పట్ల అభిమానులు, తోటి డబ్బింగ్ ఆర్టిస్టులు విచారం వ్యక్తం చేస్తున్నారు. శ్రీనివాస మూర్తిలాంటి ఒక గొప్ప డబ్బింగ్ ఆర్టిస్ట్ ఇండస్ట్రీకి దొరకడం చాలా కష్టమంటూ అభిప్రాయపడుతున్నారు. మీరు తెలుగులో చూసిన ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలకు శ్రీనివాస మూర్తి డబ్బింగ్ చెప్పారు. కొన్నేళ్లుగా మోస్ట్ సక్సెస్ ఫుల్ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కొనసాగారు.
విక్రమ్ అపరిచితుడు, సూర్య సింగం సిరీస్, 24, జనతా గ్యారేజ్ లో మోహన్ లాల్ కు, అల వైకుంఠపురంలో జయరామ్ సుబ్రమణియన్, రాజశేఖర్ కు ఇలా ఎన్నో గొప్ప చిత్రాలు, ఎందరో స్టార్ హీరోలకు శ్రీనివాస మూర్తి డబ్బింగ్ చెప్పారు. పాత్రకు తగ్గట్లు వేరియేషన్, ఎమోషనల్ సీన్లలో తన గొంతుతోనే ఆ సీన్ మొత్తాన్ని నడిపించడం చేశారు. చాలా సినిమాలు, చాలా పాత్రలు అతను చెప్పేవరకు ప్రేక్షకులు కూడా కనుక్కోలేరు దానికి డబ్బింగ్ శ్రీనివాస మూర్తి చెప్పారని అంత వేరియషన్ చూపిస్తుంటారు. కొన్ని సంవత్సరాలకు లెక్కలేనని సినిమాలకు ఈయన డబ్బింగ్ ఆర్టిస్టుగా సేవలందించారు. శ్రీనివాసమూర్తి మృతిపై సినిమా ఇండస్ట్రీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.
A popular Dubbing Artist in the South Indian Film Industry, Shri Srinivasa Murthy is no more. He dubbed for big stars like Ajith, Mohan Lal, Vikram, Shah Rukh Khan, Suriya.. list goes on. 🙏#SrinivasaMurthy #RIPSrinivasaMurthy pic.twitter.com/7PalcAfBo7
— SumanTV (@SumanTvOfficial) January 27, 2023