వేణు స్వామి.. ఏడాది క్రితం వరకు ఈయన గురించి జనాలకు పెద్ద పరిచయం లేదు. కానీ ఆయన గతంలో హీరోయిన్ సమంత గురించి చెప్పిన జాతకం నిజం కావడంతో.. ఒక్కసారిగా ఆయన పేరు మారుమోగిపోయింది. ఆ తర్వాత ఆయన సెలబ్రిటీల గురించి చెప్పిన వీడియోలు తెగ వైరలయ్యాయి. అలాగే పవన్ కళ్యాణ్‌కు కొన్ని సంవత్సరాల పాటు ఇబ్బందులు తప్పవని కూడా వేణు స్వామి తెలిపారు. వేణు స్వామి స్వీటీ అనుష్క శెట్టి, రష్మిక వివాహాలపై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. అలానే తాజాగా వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన నయనతార వైవాహిక జీవితం గురించి కూడా వేణుస్వామి జాతకం చెప్పారు. ఆమె వైవాహిక జీవితం సాఫిగా సాగదన్నారు.
ఈ క్రమంలో తాజాగా వేణు స్వామి కొత్త దంపతులు ఆది పినిశెట్టి-నిక్కీ గల్రానీల జాతకం చెప్పారు. ఇటీవల వీరిద్దరూ బంధువులు, సన్నిహితుల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది మార్చిలో ఈ ఇద్దరికి ఎంగేజ్‌మెంట్ జరగ్గా.. మే 18న పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో వేణుస్వామి వీరి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆది పినిశెట్టిది ఆశ్లేష నక్షత్రమని, నిక్కీ జతాకంతో పోల్చితే షష్టాష్టకాలు అవుతున్నాయని వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Venu Swamy: నయన తార పెళ్లిపై జ్యోతిష్యుడు వేణు స్వామి ఓపెన్ కామెంట్స్!
ఈ జాతకాల ప్రకారం.. వీరికి పెళ్లి తర్వాత సమస్యలు తప్పవన్నారు. అసలు వీరు పెళ్లికి దూరంగా ఉంటేనే ఇద్దరికి మంచిదని హెచ్చరించారు. ప్రేమ అనే మైకంలో పెళ్లి చేసుకుంటున్నారని, కానీ భవిష్యత్ పరిణామాలపై ఫోకస్ పెట్టడం లేదని అభిప్రాయపడ్డారు. జాతకాల ద్వారా విశ్లేషణ చేసి పరిహారాలు చేసుకోగలితే ఫలితం తప్పకుండా ఉంటుందని సూచించారు. ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీ భవిష్యత్ గురించి తనకు చాలా అవగాహన ఉందని, అందుకే చెప్పాల్సి వచ్చిందన్నారు. అంతేకానీ వారు విడిపోవాలనే ఉద్దేశం తనకేమీ లేదని, మున్ముందు వచ్చే సమస్యలను దూరం చేసుకోగలిగితే సమస్యలకు పరిష్కారం లభించినట్టేనని తెలిపారు.
ఇది కూడా చదవండి: హీరోయిన్ రష్మిక ఇంట్లో ప్రత్యేక పూజలు! కారణం..?
అనుష్కకు కూడా వివాహం అచ్చిరాదని తెలిపారు వేణు స్వామి. అలానే మరో హీరోయిన్ రష్మికకు కూడా వివాహం కలసిరాదని చెప్పుకొచ్చారు. అలాగే వీళ్ళ సినీ కెరీర్ కూడా త్వరలోనే అంతం అవుతుందని వేణు స్వామి అన్నారు. గతంలో రష్మిక తన కెరీర్ కోసం వేణు స్వామి దగ్గర హోమం కూడా చేయించుకుంది. మరి నిక్కీ-ఆది పినిశెట్టిల గురించి వేణు స్వామి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయానలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Love: వీడియో: క్యాష్ షోలో సాయిపల్లవి! స్టేజ్ పైనే లవ్ ప్రపోజ్ చేశాడు!