నితిన్ కొత్త సినిమా మాచర్ల నియోజకవర్గం టాలీవుడ్ వర్గాల్లో ఇప్పటికే మంచి టాక్ తో దూసుకుపోతోంది. అయితే ఈ సినిమాకి ఇప్పుడు పెద్ద చిక్కే వచ్చి పడింది. ఈ సినిమాతో ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి డైరెక్టర్ గా పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. ఈ డైరెక్టర్ పేరిట ఓ ఫేక్ ట్వీట్ ఒకటి సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది. 2019 ఏపీ ఎన్నికల ఫలితాల సమయంలో ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన ట్వీట్ అంటూ వైరల్ చేస్తున్నారు.
ఆ వైరల్ ట్వీట్ లో రెండు సామాజిక వర్గాలను కించ పరుస్తూ వ్యాఖ్యలు చేసినట్లుగా ఉంది. అది చేసింది మాచర్ల నియోజకవర్గం డైరెక్టర్ ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి అంటూ చెబుతున్నారు. ఈ వివాదంపై డైరెక్టర్ స్వయంగా స్పందించాడు. “ ఈ స్క్రీన్ షాట్ లో ఉన్న ట్వీట్ ఫేక్. ఎవరో ఎడిట్ చేసి కావాలని నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు. దయచేసి నమ్మకండి. నేను స్వతహాగా రాజశేఖర్ రెడ్డి అభిమానిని. ఫలితాలు వచ్చిన రోజు నా అభిమానాన్ని ఎక్స్ ప్రెస్ చేశాను తప్ప.. వేరే క్యాస్ట్ వాళ్లని తిట్ట లేదు. నేను ఈ ట్వీట్ డెలీట్ చేయలేదు. చేయను కూడా” అంటూ డైరెక్టర్ ట్వీట్ చేశాడు.
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 pic.twitter.com/c6C77k6BMO
— M.S.RAJASHEKHAR REDDY (@SrSekkhar) July 26, 2022
డైరెక్టర్ కు హీరో నితిన్ కూడా అండగా నిలిచాడు. రాజశేఖర్ రెడ్డి ట్వీట్ ను రీ ట్వీట్ చేస్తూ నితిన్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. “ఫేక్ పర్సన్ చేసిన ఫేక్ ట్వీట్ అనవసరపు చర్చకు తెర లేపింది. ఇది కొందరి మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉండటం విచారకరం. ఇలాంటి తప్పుడు ప్రచారాలను నేను ఖండిస్తున్నాను” అంటూ నితిన్ డైరెక్టర్ కు బాసటగా నిలిచాడు.
Fake tweet by a Fake person has created unnecessary fuss.. unfortunately this has hurt the sentiment of others..VERY SAD and DISAPPOINTING 🙏🙏🙏 I CONDEMN this kind of FALSE PROPAGANDA… https://t.co/OWCHyvwAEB
— nithiin (@actor_nithiin) July 26, 2022
అయితే ఆ ట్వీట్ వైరల్ చేస్తున్న వాళ్లు ఒక చిన్న లాజిక్ మిస్ అయ్యారంటూ చెబుతున్నారు. అదేంటంటే ప్రస్తుతం రాజశేఖర్ రెడ్డి ట్విట్టర్ పేరు ఒకలా ఉంటే.. వాళ్లు ఫేక్ ట్వీట్ లో ఇంకోలా స్పెల్ చేశారు. ఒకటి ఇంటి పేరు తర్వాత ఫుల్ స్టాప్ లేదు. రెండోది స్పెల్లింగ్ కూడా తప్పుగా ఉంది. Rajashekhar Reddy అయితే Rajasekhar Reddy అని ఉంది. ఫ్యాన్స్ అవి చూపిస్తూ ఫేక్ అంటూ కొట్టిపారేస్తున్నారు. డైరెక్టర్ పేరిట ఫేక్ ట్వీట్ వైరల్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.