సినిమా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టుల్లో ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ ఒకటి. చిత్రం మొత్తాన్ని ఒకే పార్టులో చూపించలేమని సినిమాని రెండు పార్టులుగా ప్లాన్ చేశాడు సుకుమార్. ఎర్రచందనం స్మగ్లర్‌గా అల్లుఅర్జున్ ఊర మాస్ లుక్ ఇప్పటికే అభిమానులు ఫిదా అయిపోయారు. బన్నీ- సుకుమార్ కాంబోలో వస్తున్న మూడో ప్రాజెక్టు ఇది. పుష్ప నుంచి ఏ అప్‌డేట్ వచ్చినా పిచ్చ వైరలవుతోంది. పుష్ప ప్లోమో నుంచి ‘దాక్కో దాక్కో మేక’ పాట వరకు అన్నీ యూట్యూబ్‌ని షేక్ చేసిన అప్‌డేట్‌లే.
ఇప్పుడు మరో క్రేజీ అప్‌డేట్‌తో అభిమానులకు ట్రీట్ ఇచ్చింది చిత్రబృందం. ఈ సినిమాలో మలయాళీ విలక్షణ నటుడు ఫహద్ ఫాసిల్ విలన్ పాత్రలో కనిపించబోతున్నారన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఫహద్ ఫస్ట్ లుక్‌ని విడుదల చేసింది పుష్ప టీమ్. ‘పుష్ప vs భన్వర్ సింగ్ షెకావత్’ ఐపీఎస్ క్యాప్షన్‌తో ఫహద్ లుక్ రిలీజ్ చేశారు.
ఖాకీ ప్యాంట్, వైట్ షట్, చేతికి కడియం, గుండు మీద గాటుతో ఫహద్ లుక్స్ చాలా డెడ్లీగా ఉన్నాయి. భన్వర్‌ని చూస్తేనే తప్పు చేసిన వాళ్లు వణికిపోయేలా ఉన్నాయి లుక్స్. ఇటీవల ఆయన ఈ సినిమా సెట్‌లోకి అడుగుపెట్టారు. ‘పుష్ప ది రైజ్’ పేరుతో మొదటి భాగాన్ని ఈ ఏడాది క్రిస్మస్‌కు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.