ఈరోజుల్లో నిజం బయటకి వచ్చే లోపు.. అబద్దం సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది. పోస్ట్ చేసే వార్తల్లో నిజం ఎంత? అసలు ఆ ఘటన జరిగిందా? లేదా? అన్న మినిమమ్ క్రాస్ చెక్ కూడా లేకుండా వార్తలు పోస్ట్ చేస్తున్నారు. ఈ అత్యుత్సాహం కారణంగా ఇప్పుడు మరో ఇబ్బందికర ఘటన చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. తాజాగా ప్రముఖ రంగస్థల నటుడు, దర్శకుడు, నవలా రచయిత తల్లావర్జుల సుందరం మాస్టారు కన్నుమూశారు. ఆయన తన 71వ ఏటగుండెపోటుతో చిక్కడపల్లిలోని నివాసంలో తుది శ్వాస విడిచారు. తన ఆప్త మిత్రుడు తనికెళ్లభరణికి ఫోన్ చేసిన సుందరం మాస్టారు.. తన ఛాతిలో నొప్పిగా ఉందని చెప్పారు. విషయం తెలుసుకున్న శిష్యులు ఇంటికి చేరుకుని ఆయన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే.., ఆయన అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మాస్టారు మృతితో సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ఇది జరిగిన ఘటన.
ఇక కొంతమంది నెటిజన్స్ మాత్రం అత్యుత్సాహంతో ఏకంగా కొరియోగ్రాఫర్ సుందరం మాస్టర్ చనిపోయినట్టు వార్తలు పుట్టించారు. ఇందులో నిజనిజాలను తెలుసుకోకుండా.. చాలా మంది ఈ వార్తని షేర్ చేశారు. దీంతో..కొరియోగ్రాఫర్ సుందరం మాస్టర్ చనిపోయినట్టు గంటల వ్యవధిలోనే ఫేక్ న్యూస్ వైరల్ అయ్యింది. నిజానికి చనిపోయింది ప్రముఖ రంగస్థల నటుడు, దర్శకుడు, నవలా రచయిత అయిన తల్లావర్జుల సుందరం మాస్టారు. కానీ.., ఈ సుందరం మాస్టర్.. డ్యాన్స్ మాస్టర్. ఈయన అన్నీ భాషల్లో కలిపి 10,000 కంటే ఎక్కువ నృత్య సన్నివేశాలకు దర్శకత్వం వహించారు. ఈయనకి ప్రభుదేవా, రాజు సుందరం మరియు నాగేంద్ర ప్రసాద్ అనే ముగ్గురు కుమారులు ఉన్నారు. వీరు డాన్స్ మాస్టర్లుగా స్థిరపడ్డారు. ఇద్దరు సుందరం మాస్టర్స్ మధ్య ఇంత తేడా ఉంది. మరి.. ఇలాంటి పుకార్లు ఎలా పుట్టించారో అర్ధం కాని పరిస్థితి నెలకొంది. ఇదన్నమాట అసలు నిజం. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
SUNDARAM ante senior dance master “Sundaram master” kadu. Please re – check before posting about death news.🙏
— Suresh Kondi (@SureshKondi_) March 22, 2022