సీనియర్ యాక్టర్ ప్రదీప్ గురించి సినీ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేకపోవచ్చు. కానీ f2 సినిమాలో అంతేగా అంతేగా.. అంటూ హడావిడి చేసిన యాక్టర్ అంటే ఎవరైనా ఇట్టే గుర్తుపడతారు. ఆ సినిమాలో ప్రదీప్ తెలుగు ప్రేక్షకుల ను ఒక రేంజ్ లో నవ్వించాడు. ప్రస్తుతం ఎఫ్ 3లో కూడా నటించి మెప్పించాడు. తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో యాక్టర్ ప్రదీప్ కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టాడు. అప్పటి సీనియర్ హీరో అచ్యుత్ మరణం గురించి కొన్ని సంచలన విషయాలు బయట పెట్టాడు.
తెలుగు ప్రేక్షకులకు అచ్యుత్ గురించి పెద్దగా చెప్పనక్కరలేదు. అప్పటి టాలీవుడ్ ఇండస్ట్రీలో బుల్లితెరపై, వెండితెర పై ఒక రేంజ్ లో వెలుగు వెలిగాడు. ఇక కెరీర్ పరంగా మంచి స్థాయిలో ఉన్నప్పుడు అచ్యుత్ కి 40 ఏళ్ల వయసున్నప్పుడు హఠాత్తుగా గుండెపోటు వచ్చి మరణించాడు. ఇక అచ్యుత్ అలా గుండెపోటు వచ్చి మరణించడానికి గల కారణాలు ప్రదీప్ బయటపెట్టాడు. ఇక పొగ తాగడం, నాన్ వెజ్ తినడం లాంటివి పూర్తిగా మానేసినప్పటికీ ఒత్తిడి వల్లనే అచ్యుత్ మరణించి నట్లు తెలియజేశాడు. స్వీట్స్, కూల్డ్రింక్స్ ఎక్కువగా తీసుకోవడంతో కొలెస్ట్రాల్ స్థాయి పెరిగి గుండెపోటుతో మరణించాడు అని ప్రదీప్ వెల్లడించాడు. గుండెపోటు వచ్చే వారం ముందు రోజు కూడా నేను తనని కలిసాను అని, మట్టి మనసులు సీరియల్ షూటింగ్ లో ఉన్నామని ప్రదీప్ తెలిపాడు.
కొంతమంది నటీ నటులు, హీరోలు.. అత్యున్నత స్థాయికి చేరుతున్న సమయంలో మరణించడం వారి కుటుంబ సభ్యులనే కాదు ప్రతీ ప్రేక్షకుడిని తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేస్తూ ఉంటుంది. 1990లలో ఒకవైపు సపోర్టింగ్ రోల్స్, మరోవైపు సీరియల్స్ చేస్తూ బిజీగా గడిపేవారు అచ్యుత్. మెగాస్టార్ తో కలిసి ‘హిట్లర్’, ‘బావగారు బాగున్నారా’ ‘డాడీ’ సినిమాల్లో నటించాడు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా ‘గోకులంలో సీత’ ‘తొలిప్రేమ’ ‘తమ్ముడు’ వంటి చిత్రాల్లో నటించాడు. అలాంటి అచ్యుత్ 42 ఏళ్లకే మరణించడం.. అది కూడా కెరీర్ మంచి పీక్స్ లో ఉన్నప్పుడు మరణించడం అందరినీ బాధపెట్టింది. 2002 డిసెంబర్ 26న అచ్యుత్ మరణించాడు. ఇతను సినిమాల్లో సంపాదించిందంతా వ్యాపారాల్లో పెట్టాడట. కానీ స్నేహితులు వల్ల ఆ వ్యాపారాలు దెబ్బ తినడం.. అప్పులు పాలైపోవడంతో.. మానసిక ఒత్తిడి పెరిగి గుండె పోటుతో మరణించాడని అప్పట్లో కొన్ని వార్తలొచ్చాయి.
ఇది కూడా చదవండి: Serial Actor Sathish Kumar: ప్రముఖ నటి సీతతో పెళ్లి.. సంచలన విషయాలు చెప్పిన సతీష్