గతంలో విడుదలైన సినిమాలు థియేటర్ లో కాకుండా టీవీల్లో చూడాలంటే చాలా రోజులు పట్టేది. కానీ నేడు మారిన టెక్నాలజీతో థియేటర్ లో విడుదలైన కొన్ని రోజులలోనే ఓటీటీ వేదికలపై కొత్త సినిమాలు సందడి చేస్తున్నాయి. అయితే విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన మూవీ ‘ఎఫ్3’. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వచ్చిన ఈ చిత్రం మే 27న థియేటర్ లో విడుదలై సూపర్ హిట్ టాక్ తో దూసుకు పోతుంది. ‘ఎఫ్ 2’కి సీక్వెల్ గా తెరకెక్కించిన ఈ మూవీ ఓవర్సీస్ లో సైతం మంచి రెస్పాన్స్ వస్తోంది.
ఈ చిత్రం మంచి టాక్ తోనే కాకుండా కలెక్షన్ల పరంగా కూడా ఏ మాత్రం తీసిపోకుండా బాక్సాఫీసు వద్ద వసూళ్ల సునామిని చూపిస్తోంది. అయితే తాజా లెక్కల ప్రకారం ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు రూ.134 కోట్ల పైగా షేర్ వసూళ్లు సాధించినట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ మూవీని థియేటర్ లో చూడని ప్రేక్షకులు ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని తెగ ఎదురుచూస్తున్నారు. అలాంటి వారి కోసం శుభవార్తను అందించింది ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లీవ్.
ఇది కూడా చదవండి: OTT Releases: ఈ వారం థియేటర్/OTTలో విడుదల కానున్న చిత్రాలు ఇవే!
ఈ మూవీ జులై 22 నుంచి ఓటీటీలోకి వచ్చేందుకు ముహూర్తం ఫిక్స్ అయింది. జులై 22 నుంచి ఈ మూవీ సోనీ లీవ్ వేదికగా స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా తెలిపింది. ఇక ‘ఎఫ్3’ చిత్రం త్వరలో ఓటీటీలోకి రానుండడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ‘ఎఫ్3’ మూవీ జులై 22 నుంచి ఓటీటీలోకి రానుండడంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
#F3movie OTT release on July 22. 8 weeks after the theatrical release. Just like the team promised! 👌 pic.twitter.com/XGdR8lfQtY
— idlebrain jeevi (@idlebrainjeevi) July 11, 2022