తెలుగు బుల్లితెరపై ‘జబర్ధస్త్’ కామెడీ షో అంటే భారత దేశంలో ఉన్న తెలుగు వారే కాదు విదేశాల్లో ఉన్న తెలుగు వారు సైతం బాగా అభిమానించే ప్రోగ్రామ్. కామెడీ స్కిట్స్ చేస్తూ కడుపుబ్బా నవ్వుల పువ్వులు పూయిస్తూ టెలివిజన్ చరిత్రలోనే అత్యధిక రేటింగ్‌ను పొందుతున్న ప్రోగ్రామ్ ‘జబర్ధస్త్’ కామెడీ షో. ఇక జబర్ధస్త్ తో పరిచయం అయిన యాంకర్లు అనసూయ, రష్మిలు బాగా ఫేమస్ అయ్యారు. జబర్ధస్త్ అనగానే సుడిగాలి సుధీర్, రష్మీ లక్ ట్రాక్ గురించే ఎక్కువగా మాట్లాడుకుంటారు. ప్రస్తుతం జబర్ధస్ల్ లో ఇమ్మాన్యుయేల్, వర్ష జంట ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.
ఒకప్పుడు జబర్ధస్త్ లో సుడిగాలి సుధీర్, రష్మి గౌతమ్ జోడీ గురించి ఎప్పుడూ చర్చించుకునేవారు. ఈ మద్య ఎవరికి వారే బిజీగా మారిపోయారు. దీంతో ఇప్పుడు తెరపైకి మరో కొత్త జంట వచ్చారు.. వారే వర్ష, ఇమ్మాన్యుయేల్. తాజాగా రిలీజ్ అయిన ఓ ప్రోమోలో జడ్జీగా ఉన్న ఇంద్రజ మాట్లాడుతూ.. వర్షా.. నీకు ఈ మద్య ఎప్పుడైనా ఇమ్మాన్యుయేల్ పై ఏదైనా అనుమానం వచ్చిందా.. లేదా నీపై ఇమ్ము ఎప్పుడైనా అనుమానం పడటం లాంటిది జరిగిందా అని అడిగింది.
ఇంద్ర అడిగిన ప్రశ్నకు వర్షా జవాబు ఇస్తూ.. నా లైఫ్ లో ఏదైనా లక్ ఉందంటే అది ఇమ్ము మాత్రమే.. ఎవ్వరేమనుకున్నా నో ప్రాబ్లామ్.. ఈ అమ్మయి ఏంటీ? ఆ అబ్బాయి ఏంటీ..? అంటూ ఎంతో మంది ఎన్నో విధాలుగా మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు చెబుతున్నా.. ఇమ్ము అంటే నాకు చాలా ఇష్టం అన్నారు. చివర్లో ‘ఇమ్ముతో మీ మమ్మీకి చెప్పు.. కోడలు వస్తుందని’అంటూ వర్ష వెళ్లిపోయింది.. దీంతో అక్కడ ఉన్న జడ్జీలు లైలా, ఇంద్రజతో పాటు అందరూ అందరూ నవ్వుకున్నారు.
ఈ మధ్య అన్ని స్కిట్స్‌లోనూ కడుపులు చెక్కలేయ్యేలా నవ్విస్తున్నాడు. హైపర్ ఆదికి మొదట్లో ఎలాంటి గుర్తింపు వచ్చిందో.. ఇప్పుడు అలాంటి గుర్తింపే తెచ్చుకుంటున్నాడు ఇమ్ము. ఇక సీరియల్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న వర్ష ఇప్పుడు జబర్దస్త్ షోలో రెగ్యులర్‌గా కనిపిస్తుంది. అక్కడ రాని గుర్తింపు ఈమెకు జబర్దస్త్ తీసుకొచ్చింది. వర్ష, ఇమ్మాన్యుయేల్ ఇద్దరి మధ్య కెమెస్ట్రీ బాగా వర్కవుట్ అవ్వడం.. ఆ జంట ఆన్ స్క్రీన్ మీద బాగా వర్కవుట్ అవ్వడంతో మంచి క్రేజ్ వచ్చింది.
ఆ మద్య ఓ సందర్భంలో తాజ్ మహల్ కడితేనే ఆ ప్రేమకు అర్థం.. నీ మెడలో తాళి కడితేనే నా ప్రేమకు అర్థం అని వర్షను ఉద్దేశించి ఇమ్మాన్యుయేల్ అన్నాడు. జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ.. ఇతర షోలలో ఈ జంటకు మంచి క్రేజ్ లభిస్తుంది. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.