ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో గెటౌట్ అనే పదం సృష్టించిన వివాదం అంతా ఇంతా కాదు. యాంకర్ దేవి నాగవల్లి వాడిన ఈ పదం ఎంత రచ్చ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా.. హీరో విశ్వక్ సేన్ చేసిన ఫ్రాంక్ వీడియోపై రచ్చ రేగింది. దీనిపై డిబెట్ సందర్భంగా.. దేవి నాగవల్లి-విశ్వక్ సేన్‌ల మధ్య వ్యక్తిగత దూషణలకు దారితీసింది. లైవ్‌లోనే దేవి నాగవల్లి.. హీరో విశ్వక్ సేన్‌ని గెటౌట్ అంటే.. అదే రేంజ్‌లో బూతులు తిట్టాడు విశ్వక్ సేన్. ఆ తరువాత దీనిపై ఓ రేంజ్‌లో రచ్చ జరిగింది. చాలామంది విశ్వక్‌సేన్‌కు మద్దతుగా నిలిచి దేవి నాగవల్లిని ట్రోల్ చేశారు. ఇక ఇంత వివాదానికి కారణమైన అశోకవనంలో అర్జున కళ్యాణం చిత్రం సూపర్ హిట్ అయ్యింది.
ఇక ఇప్పుడు ఇదే వివాదాన్ని మరోసారి రీక్రియేట్ చేశాడు జబర్దస్త్ ఆర్టిస్ట్ నరేష్. కరెంట్ టాపిక్ ఏదైనాసరే దానికి ఫన్ జోడిస్తూ పంచ్‌లు పేల్చడంలో ముందు ఉండే.. ఎక్స్‌ట్రా జబర్దస్త్‌లో విశ్వక్ సేన్-దేవి నాగవల్లిల గెటౌట్ గొడవను వాడేశారు. ఈ వివాదన్ని రీక్రియేట్ చేస్తూ.. నరేష్ చేసిన స్కిట్‌లో పంచ్‌లు పేలాయి. కెవ్వు కార్తీక్‌తో కలిసి చేసిన స్కిట్‌లో.. కెవ్వు కార్తీక్‌ని కుమ్మిపడేసాడు నరేష్. ఇదంతా ప్రీ ప్లాన్డ్ అని కెవ్వుకార్తీక్ అంటుంటే.. నరేష్ ‘గెటౌట్.. గెటౌట్’ అని యాంకర్ దేవి నాగవల్లిని ఇమిటేట్ చేశాడు. కెవ్వు కార్తీక్ కూడా.. విశ్వక్ సేన్ మాదిరిగా.. ‘వాట్ ద.. ’ అనబోతుంటే.. ‘నో.. ఈ స్కిట్‌లో నుంచి గెటౌట్ అంటూ దేవి నాగవల్లిని దింపేశాడు నరేష్. ఇదంతా దర్శకుడు అనీల్ రావిపూడి చూస్తూ తెగ ఎంజాయ్ చేశారు.. ఇది అదే అన్నట్టుగా సైగ చేసి నవ్వేసుకున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.