సాధారణంగా మల్లెమాల వాళ్లు రిలీజ్ చేసే ప్రోమోలు మరీ ముఖ్యంగా జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీలు, క్యాష్ షోకు సంబంధించినవి చూసి జనాలు ఎక్కువ సార్లు తిట్టుకునేవారు. ఇంకెన్ని సార్లు మమ్మల్ని ఫూల్స్ చేయాలని చూస్తారు అని మండిపడేవారు. కానీ తొలిసారి మల్లెమాల రిలీజ్ చేసిన ఎక్స్‌ట్రా జబర్దస్త్ ప్రోమో చూసి ప్రతి ఒక్కరు పాజిటీవ్‌గా స్పందించారు. చాలా మంది ఈ ప్రోమో చూసి మాకు కన్నీళ్లు ఆగడం లేదు అని కామెంట్స్ చేస్తున్నారు. మరి అభిమానులను అంత ఎమోషన్‌కు గురి చేసిన ప్రోమోలో ఏం ఉంది అంటే… సుడిగాలి సుధీర్ టీం సభ్యుల మధ్య ఉండే స్నేహ బంధం గురించి చేసిన స్కిట్.
కెవ్వు కార్తీక్, నూకరాజు, రాకేష్ ఈ ముగ్గురు సుడిగాలి సుధీర్ టీమ్‌ను అనుకరిస్తూ చేసిన స్కిట్ చూసి జడ్జీలు ఇంద్రజ, సదా, యాంకర్ రష్మీతో పాటు స్టేజీ మీద ఉన్న ప్రతి ఒక్కరు ఏడ్చారు. 2013లో సుధీర్ టీమ్ లీడర్‌గా, శ్రీను, రాంప్రసాద్ మెంబర్స్‌గా సుడిగాలి సుధీర్ టీమ్ ప్రారంభం అయ్యింది. అప్పటి నుంచి వీరి స్నేహం కొనసాగుతూనే వస్తుంది. మరి ఈ ఏడాది ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ.. తొలుత గెటప్ శ్రీను టీమ్ నుంచి వెళ్లిపోయాడు. తర్వాత సుధీర్ వెళ్లిపోయాడు. ఇప్పుడు రామ్ ప్రసాద్ మాత్రమే ఉన్నాడు. ఇక 9 ఏళ్ల ప్రయాణంలో వారి మధ్య చోటు చేసుకున్న సంఘటనలను స్కిట్ రూపంలో ప్రదర్శించగా.. రామ్ ప్రసాద్‌తో సహా అందరూ ఏడ్చారు. ఈ సందర్భంగా రామ్ ప్రసాద్ ఒంటిరి వాడినయ్యాను.. అంటూ ఎమోషన్ అయ్యాడు. ఇక జడ్జీ ఇంద్రజ అయితే ఎవరి దిష్టి తగిలిందో ఏమో అంటూ కన్నీరు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో వైరలవుతోంది. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.