ఇటీవల అమెరికాలోని లూసియానా లో న్యూ ఓర్లీన్స్ లో మిస్ యూనివర్స్ – 2022 పోటీలు ఎంతో ఘనంగా జరిగాయి. ఈ పోటీల్లో ప్రపంచ వ్యాప్తంగా 80 దేశాల సుందరీమణులు పాల్గొన్నారు. ఈ పోటీలో అమెరికాకు చెందిన బొన్ని గాబ్రియెల్ మిస్ యూనివర్స్ కిరీటాన్ని దక్కించుకుంది. ఇక మిస్ యూనివర్స్ – 2021 పోటీల్లో భారత్‌కు చెందిన పంజాబ్ బ్యూటీ హర్నాజ్ కౌర్ సంధు సొంతం చేసుకుంది. కాగా, హర్నాజ్ కౌర్ సంధు మిస్ యూనివర్స్ – 2022 పోటీలో పాల్గొని బొన్ని గాబ్రియేల్‌కు కిరీటాన్ని తొడిగింది. ఈ సందర్భంగా హర్నాజ్ కౌర్ స్టేజ్ పై ఎంతో భావోధ్వేగానికి గురైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
న్యూ ఓర్లీన్స్ లో విశ్వసుందరి పేరును ప్రకటించే సమయంలో స్టేజ్ పైకి వచ్చింది మాజీ విశ్వసుందరి హర్నాజ్ కౌర్ సంధు. ఈ సందర్భంగా విశ్వ సుందరి హోదాలో చివరిసారిగా ర్యాంప్ పై వాక్ చేసింది. ఆ సమయంలో హర్నాజ్ ఎంతో ఎమోషన్ కి గురై కన్నీళ్లు పెట్టుకుంది. అంతేకాదు ఆ సమయంలో ఆమె స్లీప్ అయి కిందపడబోయింది. వెంటనే అలర్ట్ అయి తిరిగి వాక్ చేసింది. ఈ పోటీల్లో హర్నాజ్ కౌర్ సంధు ప్రత్యేక దుస్తుల్లో అందరినీ ఆకర్షించింది.
ఇజ్రాయెల్ లో జరిగిన మిస్ యూనివర్స్ – 2021 పోటీల్లో పంజాబ్ బ్యూటీ హర్నాజ్ కౌర్ సంధు కిరీటాన్ని గెల్చుకుంది. దాదాపు రెండు దశాబ్ధాల తర్వాత భారత్ కి ప్రతిష్టాత్మక విశ్వసుందరి కిరీటం దక్కింది. 1994 లో బాలీవుడ్ బ్యూటీ సుస్మితా సేన్, 2000 లో లారా దత్తా ఈ కిరీటాన్ని గెల్చుకున్నారు. వీరిద్దరూ బాలీవుడ్ చిత్రాల్లో నటించారు. దాదాపు 20 సంవత్సరాల తర్వాత హర్నాజ్ కౌర్ సంధు మిస్ యూనివర్స్ కిరీటాన్ని దక్కించుకుంది. తాజాగా హర్నాజ్ కౌర్ సంధు కి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
Hold back tears as @HarnaazKaur takes the stage one last time as Miss Universe! #MISSUNIVERSE pic.twitter.com/L0PrH0rzYw
— Miss Universe (@MissUniverse) January 15, 2023