ఎవరికైనా వయసు పెరుగుతున్నకొద్దీ జీవితంలో అలుపు రావడం అనేది సహజం. టాలీవుడ్ లో దీనికి పూర్తిగా విరుద్ధంగా దూసుకుపోతున్నాడు నటసింహం నందమూరి బాలకృష్ణ. వెండితెర అయినా.. ఓటిటి వేదికైనా.. సినిమాలైనా.. స్పెషల్ ఈవెంట్స్ అయినా బాలయ్య ఎనర్జీ వేరే లెవల్ లో ఉంటుంది. ఒక్కసారి యాక్టీవేట్ అయ్యిందంటే.. బాలయ్య ఎనర్జీని మ్యాచ్ చేయడం చాలా కష్టం. ఈ విషయాన్నీ బాలయ్య ఎన్నోసార్లు ప్రూవ్ చేశాడు. ప్రెజెంట్ అఖండ.. అన్ స్టాపబుల్ 1, 2.. వీరసింహారెడ్డిలతో సూపర్ ఫామ్ లో ఉన్న బాలయ్య.. ‘వయసు పెరుగుతున్నకొద్దీ మీకు అలుపొస్తుందేమో.. నాకు ఊపొస్తుంది’ అని అంటున్నారు.
ప్రస్తుతం బాలయ్య వయసు 62 ఏళ్ళు. దశాబ్దాలుగా హీరోగా సినిమాలు చేస్తున్నాడు.. కొన్నాళ్లుగా తన స్టార్డమ్ ని కంటిన్యూ చేస్తున్నాడు. మాసైనా.. క్లాసైనా.. యాక్షనైనా.. ఎమోషనైనా.. ఇలా ఏదైనా తెరపై సునాయాసంగా పండించే బాలయ్య.. ఇప్పుడున్న యంగ్ హీరోలకు పోటీగా హిట్స్ కొడుతూ.. వారికంటే రెట్టింపు మాస్ ఇమేజ్ ని సొంతం చేసుకోవడం అనేది మామూలు విషయం కాదు. డాన్స్.. డైలాగ్స్ కి బాలయ్య పెట్టింది పేరు. ఎన్నేళ్ళైనా వయసు ప్రస్తావన రాకుండా తన ఎనర్జీని కొనసాగిస్తున్నాడు. కరోనాతో కుదుపుకు గురైన టాలీవుడ్ ని.. అఖండ సినిమాతో ఒక్కసారిగా ఆడియెన్స్ ని థియేటర్లకు రప్పించాడు.
ఇండస్ట్రీలోకి ఎంతోమంది హీరోలు వస్తుంటారు పోతుంటారు.. కానీ.. బాలయ్య మాస్ ఇమేజ్ ని టచ్ చేసే దమ్మున్న సినిమాలు ఎవరూ చేయలేరు. తెరపై ఎన్ని రిస్క్ లైనా చేసే బాలయ్య.. వ్యక్తిగతంగా మంచి మనసున్న రియల్ హీరో. దైవాన్ని ఎక్కువగా పూజిస్తాడు.. నటసింహం అనే పేరుకు తగ్గట్టుగా తెరపై ఉగ్రరూపాన్ని చూపిస్తాడు. ఇంకేముంది.. బాలయ్య డైలాగ్స్, యాక్షన్ తో గర్జించాడంటే ఫ్యాన్స్ కి పండగే. అదీగాక ఇండస్ట్రీలో బాలయ్య కొడతాడు, తిడతాడు అంటూ కొన్ని కామెంట్స్ వినిపిస్తుంటాయి. కానీ.. అన్ స్టాపబుల్ షో ద్వారా ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు. ఆ షో ద్వారా బాలయ్యపై ఉన్న మచ్చలన్నీ తొలగిపోయాయని చెప్పవచ్చు. అందుకే కదా.. బాలయ్య సినిమాని ప్రతి ఫ్యాన్ ఓ ఎమోషన్ లా భావించేది.
అటు బాలీవుడ్ అమితాబ్.. కోలీవుడ్ లో కమల్ హాసన్.. కన్నడలో శివరాజ్ కుమార్.. మలయాళంలో మమ్ముట్టిలాంటి స్టార్స్ సీనియర్ హీరోలు అనిపించుకున్నా.. అఖండ సినిమాతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాడు. ఆ సినిమాలో బాలయ్య నటన, డైలాగ్స్, డాన్స్ గురించి స్పెషల్ గా మాట్లాడుకున్నారు. సౌత్ లో ఏ హీరో సినిమాని తమ ప్రాంతంలో రిలీజ్ చేయాలని ఉత్తరాది ప్రేక్షకులు ఎప్పుడూ స్వయంగా అడగలేదు. కానీ.. బాలయ్య నటించిన అఖండ సినిమాని తమ ఏరియాలలో కూడా రిలీజ్ చేయాలని రిక్వెస్ట్ చేశారంటే అర్థం చేసుకోవచ్చు. బాలయ్య క్రేజ్ ఎలా విస్తరిస్తుందో! ఇవన్నీ కలిపి ప్రస్తుతం రిలీజ్ కి రెడీగా ఉన్న వీరసింహారెడ్డి మూవీపై హైలీ పాజిటివ్ వైబ్ ఉంది. మరి చూడాలి నటసింహం బాలయ్య.. వీరసింహారెడ్డిగా ఎలా బాక్సాఫీస్ పై దండయాత్ర చేస్తాడో!