టీవీ నటుడు ప్రభాకర్ ఈ మధ్య తెగ పాపులర్ అయిపోయాడు. దానికి కారణం ఆయన కుమారుడు చంద్రహాస్. కొన్నిరోజుల క్రితం చంద్రహాస్ డెబ్యూ మూవీ అనౌన్స్ మెంట్ జరిగింది. ఈ క్రమంలో ఓ ప్రెస్ మీట్ పెట్టి, తన కొడుకు కొత్త సినిమాల గురించి ప్రభాకర్ ప్రకటించాడు. వాటి గురించి ప్రమోట్ చేశాడు. అయితే ఈ ప్రెస్ మీట్ లో చంద్రహాస్ యాటిట్యూడ్ చూపించడని సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్ జరిగింది. దీంతో చంద్రహాస్ గురించి ఏ చిన్న వార్తొచ్చినా సరే నెటిజన్స్ ఇంట్రెస్ట్ చూపించడం మొదలుపెట్టారు. ఇప్పుడు తన కొడుకు చంద్రహాస్ గురించి నటుడు ప్రభాకర్.. ఎవ్వరికీ తెలియని ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. సోషల్ మీడియాలో ఈ మధ్య బాగా వినిపిస్తున్న పేరు చంద్రహాస్. తొలి సినిమా రిలీజ్ కాకుండానే నెటిజన్స్ అందరూ మాట్లాడుకునేలా చేశాడు. ప్రెస్ మీట్ లో ఈ కుర్రాడి యాటిట్యూడ్ చూపించాడని, జేబులో చేతులు పెట్టుకుని, నిలబడిన చోట ఉండకుండా చాలా ఓవరాక్షన్ చేశాడని నెటిజన్స్ ఒకటే ట్రోల్ చేస్తున్నారు. నిజానికి వీటివల్ల చంద్రహాస్ కి ఫ్రీ పబ్లిసిటీ జరిగింది. ఈ ట్రోల్స్ పై స్పందించిన ప్రభాకర్ కూడా కుమారుడు చంద్రహాస్ కి సపోర్ట్ చేస్తూనే మాట్లాడాడు. మీడియాతో వ్యవహరించడం పోనుపోను తన కొడుకు తెలుసుకుంటాడని అన్నాడు.
ప్రెస్ మీట్ లో చంద్రహాస్ నిలబడటం ఇప్పుడు చాలామందికి నచ్చకపోవచ్చు గానీ తర్వాత వాడి యాక్టింగ్ నచ్చి తిట్టినవాళ్లే నెత్తిన పెట్టుకోవచ్చని ప్రభాకర్ ధీమా వ్యక్తం చేశాడు. ఇక బ్రాండెడ్ దుస్తులు, ఎలక్ట్రానిక్ పరికరాల విషయంలో కుమారుడు చంద్రహాస్ తో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని కూడా ప్రభాకర్ చెప్పాడు. బ్రాండ్ విషయంలో తనకు పెద్దగా పట్టింపు ఉండదని.. వాడు మాత్రం బ్రాండ్ అయితేనే యూజ్ చేస్తాడని ప్రభాకర్ పేర్కొన్నాడు. గతంలో అమెరికా నుంచి ఓ వాచ్ తీసుకొస్తే.. దాన్ని చూసి ఇది బ్రాండ్ కాదని అన్నాడు. ఈ జనరేషన్ పిల్లలు బ్రాండ్, నాన్ బ్రాండెడ్ వస్తువుల్ని ఇట్లే పసిగట్టేస్తున్నారని ప్రభాకర్ చెప్పాడు. చాలారోజుల క్రితం ప్రభాకర్ మాట్లాడిన ఈ వీడియో.. ప్రస్తుతం వైరల్ గా మారింది. మరి చంద్రహాస్ బ్రాండెడ్ వస్తువుల వల్ల ప్రభాకర్ పడ్డ ఇబ్బందులపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇదీ చదవండి: కొడుకు చంద్రహాస్ పై ట్రోల్స్! స్పందించిన నటుడు ప్రభాకర్!