భారతీయ చిత్రపరిశ్రమ.. ఆణిముత్యం లాంటి మరో నటుడిని కోల్పోయింది. తన యాక్టింగ్ తో ఎంతోమంది ప్రేక్షకుల్ని రంజింపజేసిన విక్రమ్ గోఖలే(77) శనివారం తుదిశ్వాస విడిచారు. మనల్ని వదిలి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని సినీ ప్రేమికులు తీసుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఆయన చేసిన చిత్రాలు అలాంటివి. గత కొన్ని రోజుల నుంచి లైఫ్ సపోర్ట్ పై ఆయన్ని ఉంచి చికిత్స అందించారు. కానీ ఆయన అన్ని అవయవాలు పనిచేయకపోవడంతో చనిపోయినట్లు డాక్టర్లు కాసేపటి క్రితమే నిర్ధారించారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. మరాఠీ, హిందీ రంగస్థల నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి విక్రమ్ గోఖలే. ఈయన కుటుంబం మొత్తం సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్లే. విక్రమ్ తండ్రి చంద్రకాంత్ గోఖలే.. తొలి తరం రంగస్థల నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. పలు సినిమాల్లో కూడా యాక్ట్ చేశారు. ఇక విక్రమ్ కూడా.. తన 26వ ఏటా నటుడిగా ఎంట్రీ ఇచ్చారు. అమితాబ్ బచ్చన్ పర్వానా సినిమాతో యాక్టర్ గా మారారు. ‘దే ధనాధన్’, ‘హమ్ దిల్ దే చుకే సనమ్’, భూల్ భులయ్యా, మిషన్ మంగళ్, ఖుదా గవా సినిమాల్లో ఈయన నటనకు మంచిమార్కులే పడ్డాయి.
ఇక విక్రమ్ గోఖలే.. ఓవైపు సినిమాలు, మరోవైపు నాటకాలు, ఇంకోవైపు టీవీ సీరియల్స్ లో తనదైన నటనతో మెప్పించారు. సింఘాసన్, విరుధ్, జీవన్ సౌథి, అటు లాంటి వెబ్ సిరీసుల్లో కూడా నటించారు. 2010లో మరాఠీలో వచ్చిన ‘అఘాత్’ సినిమాతో డైరెక్టర్ కూడా అయ్యారు. 2012లో మరాఠీ సినిమా ‘అనుమతి’కి గాను ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు కూడా అందుకున్నారు. భారతీయ సినిమా పితామహుడిగా పేరు తెచ్చుకున్న దాదాసాహెబ్ ఫాల్కేకు వరసకు ఈయన మనవడు అవుతాడు. మొత్తంగా విక్రమ్ గోఖలే మరణంతో హిందీ, మరాఠీ చిత్ర పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. పలువురు నటీనటులు, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Maharashtra | Veteran Actor Vikram Gokhale passes away in Pune.
(File Pic) pic.twitter.com/bnLFbRyYnm
— ANI (@ANI) November 26, 2022