కొన్ని ఏళ్లుగా తెలుగు బుల్లితెర ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తుతున్న ఎంటర్టైన్మెంట్ షో “జబర్దస్త్”. కేవలం ఈ షో ద్వారానే ఎంతో మంది సాధారణ ఆర్టిస్ట్‌లు స్టార్స్ అయ్యారు. ఇలా.. జబర్దస్త్‌కి వచ్చాక నథింగ్ నుండి సంథింగ్ అనే స్థాయికి ఎదిగిన ఆర్టిస్ట్ ఇమ్మాన్యుయెల్. వర్షతో లవ్ ట్రాక్ ఇమ్ముకి బాగా కలసి వచ్చింది. ఒకానొక సమయంలో వీరిద్దరూ నిజంగానే ప్రేమలో ఉన్నారా అని ప్రేక్షకులు సైతం అనుమాన పడ్డారు అంటే అతిశయోక్తి కాదు. అయితే.. ఈ మధ్య కాలంలో ఇమ్ము, వర్ష మధ్య కాస్త గ్యాప్ పెరిగింది. ఆ విషయాన్ని వర్ష.. రోజా వద్ద పంచాయితీకి తీసుకెళ్లింది.
అంతా వర్షానే చేసిందని ఇమ్మూ కూడా కంప్లైంట్ చేశాడు. రోజా గట్టిగా వార్నింగ్ ఇస్తున్న సమయంలో నేను ప్రేమించా మేడమ్ అంటూ ఇమ్మాన్యుయేల్ వేలు చూపిస్తూ అరుస్తాడు. రోజా అందుకు సీరియస్‌గా చెయి దించూ అంటూ కోప్పడుతుంది. మూడోసారి కూడా వేలు చూపించడంతో రోజా ‘చెయి విరిచి ఎక్కడ పెడతానో నాకే తెలీదు’ అనగానే ఇమ్మూ షాకవుతాడు. అతను అలా బెదిరిపోవడం చూసి సెట్‌లో అంతా ఫక్కున నవ్వేశారు. ఇప్పుడు ఆ ప్రోమో సోషల్ మీడియా వైరలవుతోంది. మీరూ ఓ లుక్కేయండి.