బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్యర్య రాయ్ కి భారీ షాక్ తగిలింది. పనామా పేపర్స్ లీకేజీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోమవారం ఆమెకు సమన్లు జారీ చేసింది. ఈడీ తాజాగా జారీ చేసిన సమన్లలో ఐశ్వర్య రాయ్ ని ఢిల్లీలోని లోక్‌నాయక్ భవన్‌లో సోమవారం హాజరుకావాలని తెలిపింది. అయితే దీనిపై స్పందించిన ఈ ప్రపంచ సుందరి నాకు కాస్త సమయం కావాలంటూ తెలిపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
గత కొనేళ్ల నుంచి దిగ్గజ బచ్చన్ కుటంబికులైన అభిషేక్ బచ్చన్, అమితాబ్ బచ్చన్ లకు గతంలో ఈడీ సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఐశ్వర్య రాయ్ కి సైతం ఈడీ సమన్లు జారీ చేయడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. దేశంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పన్ను ఎగవేత అవకతవకలకు పాల్పడడం, మనీ లాండరింగ్ వ్యవహారాలు వంటివి ఈ పనామా పేపర్స్ లీకేజీ ద్వారా వెలుగులోకి రావడం విశేషం.
ఈ కేసులో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా 500 పైగా ప్రముఖుల పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే గత కొంత కాలం నుంచి ఐశ్వర్య రాయ్ కుంటింబికులు పనామా పేపర్స్ లీకేజీ కేసున ఎదుర్కోవడం అనేది వీరికి కాస్త తలనొప్పిగా మారిందనే చెప్పాలి. ఇక తాజాగా ఇందులో ఐశ్వర్య రాయ్ రావడంతో బాలీవుడ్ వర్గాల్లో ఈ అంశం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. పనామా పేపర్స్ లీకేజీ కేసులో ప్రపంచ సుందరికి ఈడీ సమన్లు జారీ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.