టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కు ఈడీ షాకిచ్చింది. డ్రగ్స్ కేసు వ్యవహారంలో విచారణకు హాజరు కావాలంటూ మరోసారి ఈడీ నోటీసులు ఇచ్చింది. డ్రగ్స్ కేసులో భాగంగా ఈనెల 19న విచారణకు హాజరు కావాలని నోటీసులో స్పష్టం చేసింది. అయితే గతంలో రకుల్ ను విచారించిన ఈడీ అధికారులు తాజాగా నోటీసులు జారీ చేశారు. అయితే గతంలో రకుల్ విచారణ మధ్యలోనే వెళ్లిపోయారు. దీంతో పూర్తి స్థాయిలో విచారణ చేసేందుకు రకుల్ ప్రీత్ సింగ్ ను మరోసారి హాజరు కావాలని సూచించారు. ఇదే కేసులో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది. ఆర్థిక లావాదేవీల పై రోహిత్ కు నోటీసులిచ్చినట్లుగా తెలుస్తోంది. ఆయనను కూడా ఈనెల 19న విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీసులు జారీ చేసింది.
2021లో బెంగళూరులో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డ విషయం తెలిసిందే. ఈ కేసును సవాల్ గా తీసుకున్న కర్ణాటక పోలీసులు నైజీరియన్ ను అరెస్ట్ చేశారు. అనంతరం వారిని విచారణ చేయగా అనేక విషయాలు, పలువురి పేర్లు బయటపడ్డాయి. ఈ విచారణలో తెలంగాణకు చెందిన పలువురు వ్యాపారులు, శాసనసభ్యుల పేర్లు కూడా వెలుగులోకి వచ్చాయి. వీరిలో కొందరిని బెంగళూరు పోలీసులు గతంలోనే విచారించారు. అప్పట్లో టాలీవుడ్ డ్రగ్స్ కేసులో 12 మందికి ఈడీ నోటీలు జారీ చేసిన సంగతి తెలిసిందే. గతంలోనే పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలను సిట్ ఏర్పాటు చేసి ప్రశ్నించారు. వీరిలో పూరి జగన్నాథ్, ఛార్మి, రవితేజ, రకుల్ ప్రీత్ సింగ్, ముమైత్ ఖాన్, నందు, తనీష్, తరణ్, నవదీప్, పబ్ మేనేజర్ మొదలైన వారు ఉన్నారు.
అయితే తాజాగా రకుల్ కు మరోసారి ఈడీ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈ నోటీసులు పంపినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డికి కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది. తనకు ఈడీ నోటీసులు వచ్చిన విషయాన్ని ఎమ్మెల్యే రోహిత్ కూడా ధ్రువీకరించారు. అయితే, వాటిని ఇంకా చూడలేదని చెప్పినట్లు సమాచారం. ఏ కేసులో తనకు నోటీసులు వచ్చాయో తెలియదన్నారు. తన వ్యాపారాలు, ఆదాయ పన్నులు, కుటుంబ సభ్యుల ఖతాల వివరాలు అడిగారని తెలిపారు. అయితే ఈడీ నోటీసుల విషయం గురించి మరింత సమచారం తెలియాల్సి ఉంది. మరీ మరోసారి రకుల్ కు ఈడీ నోటీసులు జారీ చేయడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.