చిత్ర పరిశ్రమంలో పదుల సంఖ్యలో సినిమాలు విడుదలవుతూ ఉంటాయి. కానీ అందులో కొన్ని మాత్రమే ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంటాయి. ఈ మధ్య కాలంలో అలాంటి మూవీలు రాలేదనే చెప్పాలి. కానీ తాజాగా విడుదలైన ఒక మూవీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఎక్కడ చూసిన ఆ సినిమా గురించే! ప్రత్యేకంగా ప్రేమికులైతే గుండెలకు హత్తుకుంటున్నారంటే అతిశయోక్తికాదు. ఈ పాటికే మీకు అర్థం అయిందను కుంటా అది ఏ సినిమానో.. అవును ఆ సినిమా పేరు ”సీతారామం’‘. ఈ సినిమాని విజయవంతం చేసినందుకు గాను హీరో దుల్కర్ సల్మాన్ ప్రేక్షకులకు ఓ లేఖ రాశారు. మరిన్ని వివరాల్లోకి వెళితే..
”సీతారామం”.. హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన చిత్రం. తాజాగా విడుదలైన ఈ మూవీ మంచి టాక్ తో దూసుకుపోతోంది. హృదయాన్ని హత్తుకునేలా డైరెక్టర్ ఈ కథను తీర్చిదిద్దాడు. ప్రతి ప్రేక్షకుడు ఈ కథకు కనెక్ట్ అవుతున్నాడు. ఈ చిత్రం విజయం సాధించడంపై హీరో దుల్కర్ సల్మాన్ తెలుగు ప్రేక్షకులకు థ్యాక్స్ చెబుతూ ఓ ప్రేమ లేఖ విడుదల చేశాడు.
లేఖలో దుల్కర్ ఈ విధంగా స్పందించాడు..” తెలుగు ప్రేక్షకులకు నేనెప్పుడూ రుణ పడి ఉంటాను. తెలుగులో నా మెుదటి మూవీ ‘ఓకే బంగారం’ విడుదలైనప్పుడు మీరు నాపై చూపించిన ప్రేమ వెలకట్టలేనిది. ఈ అవకాశం ఇచ్చిన మణిరత్నం గారికి థ్యాక్స్. అలాగే ‘మహానటి’లో ‘జెమిని గణేశన్’ పాత్ర ని ఇచ్చి తెలుగు అభిమానులకు నన్ను మరింత దగ్గర చేసిన నాగ్ అశ్విన్ కు, వైజయంతి మూవీస్ వారికి నా ధన్యవాదాలు. నేను ఎక్కడికి వెళ్లిన ‘అమ్మాడి’ అనే క్యారెక్టర్ నా జీవితంలో నిలిచిపోతుంది. ఆ తర్వతా ‘కనులు కనులు దొచాయంటే’, ‘కురుప్’ సినిమాలపై మీరు చూపించిన ప్రేమను నేను ఎప్పటికీ మరవలేను”.
‘హను రాఘవపూడి, స్వప్న గారు నా దగ్గరకి ఈ కథ పట్టుకోని వచ్చారు. ఈ కథ విన్న వెంటనే నేను కథకు కనెక్ట్ అయిపోయా. చాలా కొత్తగా ఈ కథను హను రాసుకున్నారు. ఇలాంటి కథలు వస్తే నేను డైరెక్ట్ గా తెలుగు మూవీలు చేయడానికి రెడి. మూస పద్ధతిలో వెళ్తున్న ఇండస్ట్రీకి కొత్త దారి చూపారు. సీతారామంలో చాలా మంది గొప్ప గొప్ప నటులు నటించారు. ఈ విజయం ప్రతి ఒక్కరిది. ఈ సినిమా రిలీజ్ రోజు నేను ఏడ్చాను.. ఎందుకంటే ప్రేక్షకులు ఈ మూవీని ఎలా రిసీవ్ చేసుకుంటారో ”అని.
”హను రాఘవపూడి, మృణాల్, రష్మిక, సుమంత్ అన్న, విశాల్, పీఎస్ వినోద్ గార్లకు ఎలా థ్యాక్స్ చెప్పాలో నా దగ్గర మాటలు లేవు. చివరిగా సినిమాని, కళను ఇంత గొప్పగా ప్రేమించే తెలుగు ప్రేక్షకులు నన్ను సొంత వాడిగా ఆదరించడం నా జీవితంలో మరిచిపోలేనిది.. ఇట్లు మీ రామ్” అంటూ తన భావాలకు అక్షర రూపం ఇచ్చాడు దుల్కర్ సల్మాన్. అలాగే సీతారామం నిర్మాత అశ్వనీదత్ కూడా తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుతూ లేఖ రాశారు. ప్రస్తుతం ఈ రెండు లేఖలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి వీరిద్దరు రాసిన ఈ అభిమాన ప్రేమ లేఖల పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Filled with gratitude and emotion !! 🥹🥹🥹❤️❤️🦋🦋🦋#SitaRamamSaysThankU 🙏💕#SitaRamam @dulQuer @mrunal0801 @iamRashmika @iSumanth @hanurpudi @AshwiniDuttCh @VyjayanthiFilms @SwapnaCinema @DQsWayfarerFilm @LycaProductions @RelianceEnt @SonyMusicSouth pic.twitter.com/cF5u4tqeNw
— Dulquer Salmaan (@dulQuer) August 9, 2022
A big thank you to everyone 🙏 – @AshwiniDuttCh#SitaRamamSaysThankU #SitaRamam @dulQuer @mrunal0801 @iamRashmika @iSumanth @hanurpudi @VyjayanthiFilms @SwapnaCinema @DQsWayfarerFilm @LycaProductions @RelianceEnt @SonyMusicSouth pic.twitter.com/PtJ2vyf3Vp
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) August 9, 2022