దుల్కర్ సల్మాన్.. ఈ మలయాళ స్టార్ హీరో ప్రస్తుతం కెరీర్‌లో దూసుకుపోతున్నాడు. మహానటి తర్వాత మళ్లీ తెలుగులో స్ట్రైట్ ఫిల్మ్ ‘సీతా రామం’ చేశాడు. వైజయంతీ మూవీస్ నిర్మించిన ఈ మూవీ ఆగస్టు 5న థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ఎక్కడ చూసినా సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ యాక్టింగ్ కు మంచి మార్కులు పడ్డాయి.
ఇంత టాలెంటెడ్, స్టార్ హీరో అనే బిరుదు దుల్కర్ సల్మాన్ సొంతం అయ్యాయి. కానీ, సినిమాల్లోకి రావడానికి మాత్రం తండ్రి మమ్ముట్టితో పెద్ద యుద్ధమే చేశాడంట. ఇటీవలే ఓ సందర్భంలో దుల్కర్ సల్మాన్ తాను సినిమాల్లోకి ఎలా వచ్చాడు అనే విషయాన్ని వెల్లడించాడు. సినిమాల్లోకి వెళ్తానంటే తండ్రి పెద్ద గొడవ పెట్టుకున్నారని చెప్పుకొచ్చాడు. ఆయనకు ఇష్టం లేకుండానే నటన ప్రారంభించినట్లు చెప్పాడు.
“నేను నటించడం నాన్నకు అస్సలు ఇష్టం లేదు. అందుకే నాకు డాన్సులు, ఫైట్లు వంటివి నేర్పించలేదు. ఆయన ఇష్ట ప్రకారమే నేను చదువుకుని దుబాయ్ లో ఉద్యోంగంలో చేరాను. కానీ, ఎప్పుడూ నాలుగు గోడల మధ్య ఉండి పని చేయడం నాకు నచ్చలేదు. అందుకే ఇండియా తిరిగి వచ్చేశా. నేను సినిమాల్లో నటిస్తానంటూ నాన్నను అడిగితే కోప్పడ్డారు” అంటూ దుల్కర్ అప్పటి సంగతులు గుర్తుచేసుకున్నాడు.
సినిమాల్లోకి వెళ్తానంటే మమ్ముట్టి గొడవకు దిగారన్నారు. “ హీరోగా ట్రై చేస్తాను అని నాన్నను అడిగితే పెద్ద గొడవ చేశారు. నేను అప్పటి వరకు నాన్నను అంత కోపంగా చూసింది లేదు. నా మాట వినగానే ఎంతో బాధ పడ్డారు. నువ్వు అసలు డాన్స్ చేయడం, నటించేందుకు ట్రై చేయడం నేను చూసింది లేదు. యాక్టింగ్ అంటే నువ్వు అనుకున్నంత తేలిక కాదు. నా పరువు తీసే ప్రయత్నాలు మానుకో అంటూ నాన్న చెప్పారు. బాగా చివాట్లు పెట్టారు” అంటూ దుల్కర్ చెప్పుకొచ్చాడు. దుల్కర్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.