Dulquer Salmaan: స్టార్ కిడ్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా.. తనకంటూ ఓన్ ఫ్యాన్ బేస్‌ను క్రియేట్ చేసుకున్నారు దుల్కర్ సల్మాన్. కేవలం మాతృభాషకు మాత్రమే పరిమితం కాకుండా అన్ని భాషల్లో సినిమాలు చేస్తున్నారు. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటుడిగా రానిస్తున్నారు. మహానటి సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టారు. ఆ సినిమాలో సావిత్రి భర్త, జెమినీ గణేషన్ పాత్రలో నటించారు. నటనతో అందర్నీ మెప్పించి శభాష్ అనిపించుకున్నారు. చాలా ఏళ్ల తర్వాత తెలుగులో ‘సీతారామమ్’సినిమా చేశారు. ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచింది. హీరోహీరోయిన్ల నటనకు మంచి మార్కులు పడ్డాయి. సినిమా హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా రెండిటి క్రెడిట్‌ను సమానంగా తీసుకుంటూ ఉన్నారు దుల్కర్.
తనపై సోషల్ మీడియా వేదికగా వచ్చే విమర్శలపై తాజాగా దుల్కర్ స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ నేను అభిషేక్ బచ్చన్ గురించి ఓ వార్త విన్నాను. ఆయన తనపై వచ్చిన విమర్శల తాలూకా పేపర్ కటింగ్స్‌ను అద్దానికి తగిలించుకుంటారంట. ఇక, నా విషయానికి వస్తే.. నా ఫోన్‌ను మీరు సెర్చ్ చేశారంటే గ్యాలరీలో కొన్ని స్క్రీన్ షాట్లు కనిపిస్తాయి. అవన్నీ నన్ను వ్యక్తిగతంగా విమర్శించినవారివి. ఆ విమర్శల తాలూకా స్క్రీన్ షాట్లను సేవ్ చేసిపెట్టుకుంటాను. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్ ఇలా అన్నిటి స్క్రీన్ షాట్లు తీసుకుంటాను. వాటిని అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను. ముఖ్యంగా నన్ను వ్యక్తిగతంగా అటాక్ చేసే వారి ఐడీలు కూడా నాకు గుర్తే’’ అని అన్నారు. కాగా, దుల్కర్ సల్మాన్ నటించిన తాజా చిత్రం ‘‘చుప్: రివెంజ్ ఆఫ్ ది ఆర్టిస్ట్’’ అనే హిందీ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.
ఈ సినిమాను ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ బల్కి తెరకెక్కించారు. దుల్కర్‌తో పాటు సన్నీడియోల్, పూజా భట్, శ్రేయా ధన్వంతరి లీడ్ రోల్స్‌లో నటించారు. సైకోపాత్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో ఓ ప్రత్యేక విషయం కూడా ఉంది. దర్శకుడు బల్కి మిత్రుడు.. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కొన్ని సీన్లకు మ్యూజిక్ అందించారు. సినిమా టైటిల్స్‌లో మ్యూజిక్ కంపోజర్‌గా అమితాబ్ బచ్చన్ పేరు మొదటి సారిగా పడనుంది. మరి, విమర్శలపై దుల్కర్ స్పందిస్తున్న తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Indiana Jones: ‘ఇండియానా జోన్స్’ లెవెల్లో రాజమౌళి-మహేష్ సినిమా!