‘ప్రస్తుత చిత్ర పరిశ్రమకు హద్దుల్లేవ్’ ఈ మాట అన్నది ఎవరో కాదు స్టార్ హీరో ధనుష్. ఆయన అన్నట్లుగానే ఇప్పుడు విడుదల అయ్యే సినిమాలు అన్నికేవలం ఒక్క భాషలోనే కాకుండా పలు భాషల్లో రిలీజ్ అవుతున్నాయి. వాటినే మనం పాన్ ఇండియా మూవీస్ అంటూన్నాం. తాజాగా ఓ స్టార్ హీరో పాన్ ఇండియా అనే పదం పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరిన్ని వివరాల్లోకి వెళితే..
దుల్కర్ సల్మాన్.. ‘ఓకె బంగారం’ ‘మహానటి’, ‘కనులు కనులను దోచాయంటే’, ‘కురుప్’ వంటి చిత్రాలతో తనకంటూ తెలుగులో ఓ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఈ సారి అతను ఓ అందమైన ప్రేమకథతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అదే ‘సీతా రామం’. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన ఓ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ చిత్రానికి హను రాఘవపూడి దర్శకత్వం వహించగా స్టార్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ నిర్మించారు.
సీతా రామం మూవీ ఆగస్టు 5 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మూవీ టీం మెుత్తం ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఓ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన హీరో దుల్కర్ సల్మాన్ పాన్ ఇండియా మూవీ అనే పదం పై స్పందించారు. ”మీ మూవీ కూడా తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం భాషల్లో విడుదల అవుతోందిగా ఇదీ పాన్ ఇండియా సినిమానే కదా”? అంటూ యాంకర్ ప్రశ్నించగా..
దుల్కర్ మాట్లాడుతూ.. ” అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, షారుఖ్ ఖాన్.. ఇలా ఎంతో మంది సినిమాలు దేశ విదేశాలు దాటి ఆడాయి. ఇప్పుడు ప్రత్యేకంగా పాన్ ఇండియా ఫిల్మ్ అని నొక్కి చెప్పడం అవసరం లేదని నా ఫీలింగ్. సినిమాని సినిమా అంటే చాలు. పాన్ ఇండియా అనే మాట వినీ వినీ చిరాకు వచ్చిందని” తెలిపారు.
ఈ రోజుల్లో ఆ పదం వాడకుండా ఒక్క ఆర్టికల్ కూడా ఉండటం లేదని, నిజానికి పాన్ ఇండియా అనేది కొత్త కాన్సెప్ట్ ఏమీ కాదు. అంటూ చెప్పుకొచ్చాడు. తాజాగ జరిగిన ప్రీ రిలీజ్ వేడుకకు రెబల్ స్టార్ ప్రభాస్ వచ్చి యూనిట్ ఆశీర్వదించారు. ప్రతీ ఒక్కరు థియేటర్ కు వెళ్లి సినిమాను చూడాలి కూడా కోరాడు. మరి దుల్కర్ సల్మాన్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.