సినీ ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడు తాను అనుకున్న పాయింట్ ఆఫ్ వ్యూలో కథలను సినిమాలుగా తీస్తుంటారు. అవి బాక్సాఫీస్ వద్ద వర్కౌట్ అవ్వొచ్చు, అవ్వకపోవచ్చు. కానీ.. కథకు సంబంధం లేకుండా టైటిల్ పెట్టినా.. సినిమాలో టైటిల్ కి జస్టిఫికేషన్ చేయకపోయినా సినిమాలు ప్లాప్స్ గా మిగిపోతుంటాయి. అయితే.. ఓ కొత్త దర్శకుడు పొరపాటు చేశాడంటే మామూలే అనుకుని.. మరోసారి రిపీట్ కాకుండా జాగ్రత్త పడాలని చెబుతుంటారు.
అదే ఓ స్టార్ డైరెక్టర్.. కెరీర్ లో ఇండస్ట్రీ హిట్స్ ఉన్న దర్శకుడి నుండి టైటిల్ జస్టిఫికేషన్ లేకుండా సినిమాలు వస్తే ఏ స్థాయిలో విమర్శలు ఫేస్ చేయాల్సి వస్తుందో చెప్పక్కర్లేదు. తాజాగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన లైగర్ సినిమాపై ఇలాంటి కామెంట్స్ వినిపిస్తున్నాయి. విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్.. ‘లైగర్.. సాలా క్రాస్ బ్రీడ్’ అనే టైటిల్ తో పాన్ ఇండియా మూవీ తీసిన సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫలితం గురించి పక్కన పెడితే.. సినిమాలో హీరో క్యారెక్టర్ కి సంబంధించి ట్రోల్స్ వస్తున్నాయి.
ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండ బాక్సర్ అవ్వడమే కాకుండా.. మాటలో నత్తి కలిగి ఉండటం మైనస్ అంటున్నారు. ఎందుకంటే.. పూరి జగన్నాథ్ సినిమాలంటేనే హీరోలంతా గలగలా మాట్లాడుతూ.. ఊరమాస్ డైలాగ్స్ తో థియేటర్స్ లో విజిల్స్ వేయిస్తుంటారు. కానీ.. లైగర్ విషయానికి వచ్చేసరికి.. హీరోకి మాటలో నత్తి ఉండటం.. మాటిమాటికీ నత్తితో ఇబ్బంది పడటం.. దీంతో సినిమాలో హీరో క్యారెక్టర్ నుండి ఎలాంటి మాస్ డైలాగ్స్ కి స్కోప్ లేకుండా పోవడం అనేవి పూరి పై కామెంట్స్ కి దారితీశాయి.
ఈ క్రమంలో నత్తి కావాలని పెట్టారా? లేకపోతే లైగర్ అనే బ్రీడ్ లో ఇలాంటి హెల్త్ ఇష్యూస్ ఏమైనా నిజంగానే ఉంటాయా? అనే దిశగా ఆరా తీస్తున్నారు నెటిజన్స్. అందులో భాగంగా క్రాస్ బ్రీడ్ జీవుల్లో సాధారణంగా వైకల్యాలు, రెటీనా క్షీణత, అసాధారణ కపాల నిర్మాణం, మానసిక బలహీనత, మూత్రపిండాల సమస్యలు, కార్డియాక్ లోపాలు, పార్కిన్సన్స్ వ్యాధి, పార్శ్వగూని మరియు ఇతర వెన్నెముక సమస్యలతో పాటు మాట తీరు నత్తిగా రావడం అనేది కూడా వీటిలో సమస్యలలో ఒకటని అంటున్నారు.
మరి లైగర్ సినిమాలో విజయ్ దేవరకొండ క్యారెక్టర్ కి నత్తి పెట్టడం వెనుక పూరి జగన్నాథ్ చాలానే రీసెర్చ్ చేశాడని.. అలా ఊరికే నత్తి పెట్టడం కాకుండా.. సైంటిఫిక్ కారణాలను పరిగణలోకి తీసుకుని పెట్టి ఉంటాడని అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు తీసిన పూరి.. ఇలా ఓ సినిమా కోసం హీరోకి కారణం లేకుండా నత్తి పెట్టేంత పిచ్చివాడేం కాదని పూరిని సపోర్ట్ చేస్తున్నారు. మరి లైగర్ సినిమాపై, సినిమాలో హీరో క్యారెక్టర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.