ఈ ఫోటోలో పవన్ కళ్యాణ్ ఒక బాబుని ఆశీర్వదిస్తున్నారు. ఎవరో గుర్తుపట్టారా? ఆ బాబు ఇప్పుడు ఒక సూపర్ స్టార్. హాలీవుడ్ స్థాయిలో విమర్శకుల ప్రశంసలు అందుకున్న హీరో. గుర్తుపట్టారా?
సెలబ్రిటీలకు సంబంధించి చైల్డ్ హుడ్ ఫోటోలు, త్రోబ్యాక్ ఫోటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తుంటాయి. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ఒక బాబును ఆశీర్వదిస్తున్న ఫోటో ఒకటి నెట్టింట చక్కెర్లు కొడుతోంది. బాబుకు సంబంధించి బారసాల కార్యక్రమమో లేక అన్నప్రాసన కార్యక్రమమో ఏదో జరిగి ఉండచ్చు. ఆ వేడుకలో పవన్ కళ్యాణ్ సందడి చేశారు. సందడి చేయడమే గాక ఆ బాబు నెత్తి మీద అక్షింతలు వేసి ఆశీర్వదించారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఆ ఫోటోలో ఉన్న బాబు ఎవరా అని నెటిజన్స్ ఆరా తీస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ ఆశీర్వదిస్తున్న ఆ బాబు ఎవరో గుర్తుపట్టారా?
ఈ ఫోటోలో పవన్ ఆశీర్వదిస్తున్న ఆ బాబు ఇప్పుడొక క్రేజీ సూపర్ స్టార్. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్, రెండవ సినిమాతోనే ఇండస్ట్రీ హిట్ కొట్టిన హీరో. ఎహె ఈ హీరోకి నటన రాదు అని విమర్శలు చేసిన వారితోనే శభాష్ అనిపించుకున్న క్రిటిక్స్ హీరో. బాలీవుడ్ లో సినిమా చేస్తే నవ్వారు.. ఇప్పుడు అదే బాలీవుడ్ జనాలు, హీరోలతో సహా అందరూ తోపు హీరో అంటున్నారు. ఇంకా బాలీవుడ్ ఏంటి బ్రదరూ.. హాలీవుడ్ లోనే జెండా పాతేస్తేనూ. తన నటనతో బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, హాలీవుడ్ అని అన్ని ఫిల్మ్ వుడ్ లను ఇంప్రెస్ చేసి పడేశారు. ఈరోజు గ్లోబల్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. ఆయనే వన్ అండ్ ఓన్లీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.
తండ్రిలోని క్రమశిక్షణను, బాబాయ్ లోని అణకువను కలిపి పుణికిపుచ్చుకున్న మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఇవాళ ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా ఎదగడం ఆయనకు, ఆయన కుటుంబానికి, ఆయన ఫ్యాన్స్ కి మాత్రమే కాదు.. తెలుగు వారందరికీ గర్వకారణం. రామరాజు పాత్రలో ఒదిగిపోయి అంతర్జాతీయ స్థాయిలో ఆ పాత్రకు, తెలుగు సినిమాకు గౌరవాన్ని తీసుకొచ్చారు. నటన రాదన్నారు, కుమిలిపోలేదు. నిజానికి మగధీర సినిమాతోనే తానేంటో నిరూపించుకున్నారు చరణ్. కానీ ఆ తర్వాత నుంచి బ్రూస్లీ సినిమా వరకూ ఒకేలా చేస్తున్నారు అని విమర్శించడంతో సమాధానం చెప్పాలని అనుకున్నారు. అంతే ధృవ, రంగస్థలం సినిమాలతో తనలో ఉన్న మరో నటుడ్ని పరిచయం చేశారు. రంగస్థలం సినిమాలో చిట్టిబాబు పాత్రకు మెంటలొచ్చేస్తుంది. ఇక ఆర్ఆర్ఆర్ లో విశ్వరూపం చూశాం. దాని గురించి ప్రత్యేకించి చెప్పాలా? ఎంత ఎదిగినా ఒదిగి ఉండే రామ్ చరణ్ పుట్టినరోజు ఇవాళ. మరి ఈ గ్లోబల్ స్టార్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి అభిమానాన్ని చాటుకోండి.