సెలబ్రిటీలకు సంబంధించిన చైల్డ్ హుడ్ ఫోటోలు, త్రో బ్యాక్ ఫోటోలు అప్పుడప్పుడు బయటకు వస్తుంటాయి. పుట్టినరోజులప్పుడో, మదర్స్ డే, ఫాదర్స్ డే వంటి అకేషన్స్ లో తమ చిన్ననాటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. అలా ఒక హీరో ఆ మధ్య షేర్ చేసిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో అమ్మతో కలిసి దిగిన ఈ చిన్నోడు.. 2012లో హీరోగా చేసిన ఒక ప్రేమ కథా చిత్రంతో మంచి గుర్తింపు వచ్చింది. హీరోగా చిన్న సినిమాలు చేస్తూనే.. మరో పక్క క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు హీరోగానే చేయాలి అని నియమం పెట్టుకోకుండా వచ్చిన ప్రతి పాత్రను చేసుకుంటూ వెళ్లిపోతున్నారు.
అయితే చేసిన ఏ పాత్ర అయినా సరే.. అందులో ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇస్తారు. ఇప్పుడున్న యంగ్ ఆర్టిస్ట్ లలో తోపు ఆర్టిస్ట్ అని అంటారు. విలక్షణమైన పాత్రలు చేస్తూ అందరి ప్రశంసలు దక్కించుకుంటున్నారు. అతను మరెవరో కాదు.. అందాల రాక్షసి సినిమాతో మనందరి మనసు దోచుకున్న నవీన్ చంద్రనే ఈ ఫోటోలో ఉన్న చిన్నోడు. ఈ సినిమా తర్వాత దళం, త్రిపుర, లచ్చిందేవికి ఓ లెక్కుంది, మీలో ఎవరు కోటీశ్వరుడు, జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్, సూపర్ ఓవర్ వంటి సినిమాల్లో హీరోగా నటించారు. హీరోగా చేస్తూనే మధ్యలో ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో కూడా నటించారు. నేను లోకల్, అరవింద సమేత వీర రాఘవ, ఎవరు, విరాట పర్వం, రంగ రంగ వైభవంగా వంటి సినిమాల్లో నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్లో నటించి మెప్పించారు. తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా పలు సినిమాల్లో నటించారు. విలన్ గా, నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కూడా తనదైన ముద్ర వేసుకున్నారు.
సినిమాల్లోనే కాకుండా వెబ్ సిరీస్ లలో కూడా తన నటనతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. నవీన్ చంద్ర సినిమాలంటే కంటెంట్ ఉంటుంది అన్న నమ్మకం తెచ్చుకున్నారు. నవీన్ చంద్ర బళ్ళారిలోని దేవినగర్ లో జన్మించారు. ఈయన తండ్రి కేఎస్ ఆర్టీసీలో హెడ్ మెకానిక్. నవీన్ చంద్ర డిప్లోమాలో మెకానికల్ ఇంజనీరింగ్ చేశారు. సినిమాల్లోకి రాకముందు మల్టీమీడియా యానిమేటర్ గా పని చేశారు. 2006లో సంభవామి యుగే యుగే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన నవీన్ చంద్రకు. 2012లో అందాల రాక్షసి సినిమాతో గుర్తింపు వచ్చింది. హీరోగా సినిమాలు చేసినప్పటికీ హీరోగా కంటే కూడా నటుడిగానే నవీన్ చంద్రకు ఎక్కువ గుర్తింపు వచ్చింది.
ఓటీటీలో విడుదలైన భానుమతి రామకృష్ణ సినిమాతో క్లాసిక్ హిట్ ను అందుకున్నారు. క్లాసు, మాసు, నెగిటివ్, విలన్ ఏ పాత్ర అయినా సరే చాలా బాగా నటిస్తారన్న పేరుంది. రీసెంట్ గా బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమాలో డీసెంట్ పాత్రలో నటించి అదరగొట్టారు. విలక్షణ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నవీన్ చంద్ర హీరోగా నటించిన మాయగాడు సినిమా ఫిబ్రవరి 3న విడుదలైంది. కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది. మాయగాడు సినిమా మీరు చూశారా? ఎలా ఉందో కామెంట్ చేయండి.