ఇండస్ట్రీలో తొంభై శాతం హీరోయిన్స్ మోడలింగ్ ద్వారా వస్తుంటారు. ముందుగా మోడలింగ్ లో కెరీర్ ప్రారంభించి.. అలా కమర్షియల్ యాడ్స్.. బ్యూటీ కాంపిటీషన్స్ లో పాల్గొంటూ సినిమాలలో ఎంట్రీ ఇస్తుంటారు. ఇది ఎన్నాళ్ళుగానో జరుగుతూ వస్తోంది. సినీ బ్యాక్ గ్రౌండ్ ఉండి, లేనివాళ్లను పక్కన పెడితే.. భాషతో సంబంధం లేకుండా మోడలింగ్ ద్వారా అవకాశాలు అందుకొని హీరోయిన్స్ అయ్యేవారు ఎక్కువగా ఉంటారు. వారిలో మొదటి సినిమాతో సూపర్ క్రేజ్ సంపాదించుకునేవారు రేర్. ఇప్పుడు మనం పైన ఫోటోలో చూస్తున్న బ్యూటీ.. రేర్ కేటగిరీకే చెందుతుంది.
చిత్రపరిశ్రమలో తొంభై శాతం హీరోయిన్స్ మోడలింగ్ ద్వారా వస్తుంటారు. ముందుగా మోడలింగ్ లో కెరీర్ ప్రారంభించి.. అలా కమర్షియల్ యాడ్స్.. బ్యూటీ కాంపిటీషన్స్ లో పాల్గొంటూ సినిమాలలో ఎంట్రీ ఇస్తుంటారు. ఇది ఎన్నాళ్ళుగానో జరుగుతూ వస్తోంది. అలా కొందరు సినీ బ్యాక్ గ్రౌండ్ నుండి.. మరికొందరు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్, యాక్టింగ్ ఎక్సపీరియెన్స్ లేకుండా లక్కు కొద్దీ హీరోయిన్స్ అయిపోతుంటారు. ఇక సినీ బ్యాక్ గ్రౌండ్ ఉండి, లేనివాళ్లను పక్కన పెడితే.. భాషతో సంబంధం లేకుండా మోడలింగ్ ద్వారా అవకాశాలు అందుకొని హీరోయిన్స్ అయ్యేవారు ఎక్కువగా ఉంటారు. వారిలో మొదటి సినిమాతో సూపర్ క్రేజ్ సంపాదించుకునేవారు రేర్.
ఇప్పుడు మనం పైన ఫోటోలో చూస్తున్న బ్యూటీ.. రేర్ కేటగిరీకే చెందుతుంది. ఎందుకంటే.. మోడలింగ్ లో క్రేజీ బ్యూటీగా.. ఇండియాని ఇంటర్నేషనల్ లెవెల్ బ్యూటీ కాంపిటీషన్స్ లో రిప్రెజెంట్ చేసి.. మొదటి సినిమాతోనే ఇండియా వైడ్ క్రేజ్ సొంతం చేసుకుంది. ఏంటి మోడల్ అంటున్నారు.. మొదటి సినిమాకే పాన్ ఇండియా క్రేజ్ అంటున్నారు.. పైగా చిన్నప్పటి పిక్ చూస్తే ఏమాత్రం గుర్తు పట్టలేకుండా ఉంది.. ఎవరీ వయ్యారి? అని ఆలోచిస్తున్నారా! బాహుబలి, బాహుబలి 2 సినిమాల తర్వాత.. ఈమె నటించిన సినిమా గురించి గొప్పగా మాట్లాడుకున్నారు.. అదికూడా రెండు భాగాలుగా రిలీజ్ అయ్యింది.
బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 1200 కోట్లు కొల్లగొట్టింది. ఇప్పటికైనా గుర్తొచ్చిందా..? ఇప్పటికే చాలా క్లూస్ ఇచ్చేశాను. అయినా గుర్తు రాలేదంటే.. సినిమాలో ఆమె ఫాదర్ రాజేంద్ర దేశాయ్ గురించి చెప్పాల్సిందే. అతను రాకీ భాయ్ కి మామ అవుతాడు.. ఇప్పుడు పక్కాగా తెలిసే ఉంటుంది. ఎస్.. ఆ బ్యూటీ ఎవరో కాదు.. కేజీఎఫ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి. మోడలింగ్ ద్వారా కెరీర్ స్టార్ట్ చేసిన ఆ భామ.. కేజీఎఫ్ సిరీస్ తర్వాత మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారింది. 2016లో ‘మిస్ సూపర్ నేషనల్’ టైటిల్ గెలిచిన శ్రీనిధి.. ఆ తర్వాత 2017లో కేజీఎఫ్ ఆఫర్ అందుకుంది. అక్కడినుండి హీరో యశ్, ప్రశాంత్ నీల్, హోంబలే ఫిలిమ్స్ టీమ్ లో కలిసి కేజీఎఫ్ తో పాన్ ఇండియా సక్సెస్ సొంతం చేసుకుంది.
ఇక్కడ డెబ్యూ మూవీనే పాన్ ఇండియా సక్సెస్ ఇవ్వడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. చాలామంది కొన్ని సినిమాలు చేసి.. కావాల్సినంత క్రేజ్ సంపాదించుకొని.. అప్పుడు పాన్ ఇండియా వైపు అడుగులు వేస్తుంటారు. కానీ.. శ్రీనిధి మొదటి అడుగే చాలా బలంగా వేసింది. అయితే.. కేజీఎఫ్ తో రావాల్సినంత క్రేజ్ వచ్చినప్పటికీ.. ఎందుకో మరి సినిమాల పరంగా వేగం పెంచట్లేదు. కేజీఎఫ్ సిరీస్ తర్వాత కోబ్రా మూవీ మాత్రమే చేసింది. త్వరలోనే విక్టరీ వెంకీ ‘సైంధవ్’ మూవీతో తెలుగు డెబ్యూ చేయనుందని తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం శ్రీనిధి తన తల్లితో ఉన్న చిన్ననాటి పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి శ్రీనిధి శెట్టి గురించి.. ఆమె చిన్ననాటి పిక్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.