పిల్లలు అనే అనుభూతి దేవుడిచ్చిన గొప్ప వరం. బయట ఎన్ని కష్టాలు ఉన్నా.. ఇంటికొచ్చి పిల్లల మొఖం చూసే సరికి దెబ్బకి కష్టాలన్నీ ఒక్కసారిగా ఎగిరిపోయిన అనుభూతి కలుగుతుంది. బాధలతో బరువెక్కిన గుండె ఒక్కసారిగా తేలికైపోతుంది. పిల్లలంటేనే ఒక మెడిసన్. పిల్లలు దేవుడితో సమానం అంటారు. అందుకే కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని దేవుడి గెటప్ వేసి మురిసిపోతుంటారు. ఇలానే ఈ ఫోటోలో కనబడుతున్న చిన్నారిని కూడా కృష్ణుడి వేషం వేయించారు. మరి ఈ ఫోటోలో ఉన్న చిన్ని కృష్ణుడిని గుర్తుపట్టారా? ఈ చిన్నారి రీసెంట్ గా కృష్ణుడి బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమాలో నటించింది.
ఆమె కర్లింగ్ హెయిర్ చూస్తే నూడుల్స్ గుర్తుకొస్తాయి. సరిహద్దుల్లో నిలబెడితే యుద్ధం ఆగిపోయేలా ఉంటుంది ఆమె నవ్వు. క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో హార్ట్ బీట్ ని పెంచేస్తుంది. ఆ కళ్ళలో ఏదో తెలియని మాయ ఉంది. ఆమె చీర కడితే చీరకే అందం వస్తుంది. మోడ్రన్ డ్రెస్ వేస్తే హార్ట్ డిస్క్ లో మ్యాజిక్ జరుగుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే గుండె జారి గల్లంతవుతుంది. మలయాళ ప్రేమమ్ లో మేరీ జార్జ్ గా, తెలుగు ప్రేమమ్ లో సుమగా మాయ చేసింది. అఆ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. వల్లి, నాగవల్లి అంటూ మనల్ని అలరించిన అనుపమనే ఈ చిన్నారి. అనుపమ పరమేశ్వరన్, ఈమెకి హీరోయిన్ గా కంటే కూడా బయట సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉంది.
కుర్రాళ్ళు ఈ నూడుల్స్ బ్యూటీ అంటే పిచ్చెక్కిపోతారు. తెలుగులో శతమానం భవతి సినిమాతో హీరోయిన్ గా అవకాశం దక్కించుకుంది. బావ బావ అంటూ వెంటపడే మరదలి పాత్రలో తెలుగోళ్ళకి బాగా దగ్గరైంది. ఆ తర్వాత ఉన్నది ఒకటే జిందగీ, కృష్ణార్జున యుద్ధం, హలో గురు ప్రేమ కోసమే, రాక్షసుడు, రౌడీ బాయ్స్, అంటే సుందరానికి వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ భాషల్లో కూడా నటిగా, హీరోయిన్ గా క్రేజ్ దక్కించుకుంది. కార్తికేయ 2 సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అనుపమ.. ఫుల్ జోష్ లో ఉంది. ఈ సినిమా తెలుగులోనే కాకుండా హిందీ, తమిళం, మలయాళ భాషల్లో కూడా రిలీజై పాన్ ఇండియా మూవీగా రికార్డులు క్రియేట్ చేసింది.
శ్రీకృష్ణుని ద్వారకా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాతో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ కి, దర్శకుడు చందూ మొండేటికి దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం నిఖిల్, అనుపమ కలిసి 18 పేజెస్ అనే రొమాంటిక్ కామెడీ చిత్రంలో నటిస్తున్నారు. సిద్ధూ జొన్నలగడ్డ సరసన డీజే టిల్లు సీక్వెల్ లో నటిస్తోంది. అంతేకాదు బటర్ ఫ్లై అనే లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్ లో కూడా నటిస్తోంది ఈ చిన్నది. ఇవే కాకుండా మలయాళంలో జేఎస్కే అనే మూవీలో, తమిళంలో సైరెన్ అనే మూవీలో నటిస్తోంది. సెలబ్రిటీలు ఫేమస్ అయితే వారి చైల్డ్ హుడ్ ఫోటోలు, త్రో బ్యాక్ ఫోటోలు నెట్టింట్లో చక్కెర్లు కొడుతుంటాయని. తాజాగా అనుపమ చిన్ననాటి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అదన్నమాట విషయం.