త్రో బ్యాక్ పేరుతో సోషల్ మీడియాలో సెలబ్రిటీల చైల్డ్ హుడ్ ఫోటోలు సందడి చేస్తుంటాయి. తాజాగా ఈ ఫోటో కూడా ఇప్పుడు నెట్టింట సందడి చేస్తుంది. ఈ ఫోటోలో కనిపిస్తున్న క్యూటీని గుర్తుపట్టారా? 2018లో ఇయర్ ఆఫ్ ది ఇండియన్ సెలబ్రిటీగా అందరి మనసులు దోచుకుంది. గూగుల్ తల్లిని తెగ ఇబ్బంది పెట్టేసింది. ఆ టైంలో ఎక్కువ మంది ఈమె కోసం గూగుల్ సెర్చ్ ఇంజిన్ లో తెగ వెతికారు ఈ బ్యూటీ గురించి. సినిమా రిలీజ్ కాకముందే స్టార్ సెలబ్రిటీ అయిపోయింది. తెలుగులో రెండు సినిమాలు చేసింది. కానీ పెద్దగా ఏం కలిసి రాలేదు. అయితే బాలీవుడ్, మాలీవుడ్ ఇండస్ట్రీల్లో వరుస సినిమాలతో దూసుకుపోతుంది. హీరోయిన్ గా బిజీ అయిపోయింది. కొంచెం టైమ్ దొరికితే సోషల్ మీడియాలో అందాలతో అభిమానులకి చెక్ పెడుతుంది.
సినిమా షూటింగ్ దశలో ఉండగానే అందరి చూపు తన వైపు తిప్పుకుంది. ఎవర్రా ఈ అమ్మాయి ఇంత అందంగా ఉంది అని కుర్రాళ్ళు పిచ్చెక్కిపోయారు. అప్పటి వరకూ చిన్న పాత్ర ఇచ్చిన దర్శకుడు సైతం ఈమె ఫేమస్ అవ్వడంతో కేరెక్టర్ లెంత్ పెంచారు. ఇప్పుడు మీకు ఐడియా వచ్చుంటుంది కదా. ఆ హీరోయినే ఈ ఫోటోలో ఉన్న క్యూటీ, ప్రియా ప్రకాష్ వారియర్. అవును ప్రియా ప్రకాష్ వారియర్ నే ఈ ఫోటోలో ఉన్న క్యూటీ. దిష్టి తగలకుండా బుగ్గన ఒక చుక్కతో, చేయి గడ్డం కింద పెట్టుకుని స్టైల్ గా ఫోటోకి స్టిల్ ఇచ్చిన క్యూటీనే మన ప్రియా ప్రకాష్ వారియర్. తనహ అనే మలయాళం సినిమాలో ఒక పాటలో నర్తించిన ప్రియా వారియర్.. ఒరు అదార్ లవ్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.
ఈ సినిమా రిలీజ్ కి ముందే ఒకే ఒక్క షాట్ తో అందరి దృష్టిని ఆకర్షించింది. కన్ను కొట్టి, రెండు వేళ్ళు పైకి లేపి గన్ తో కాల్చినట్టు చేసే ఆ చిన్న షాట్ మొత్తం దేశాన్నే ఒక ఊపు ఊపేసింది. దీంతో ఎవరీ ఎక్స్ప్రెషన్ క్వీన్ అని అందరూ తెగ సెర్చింగులు మొదలుపెట్టారు. ఆ తర్వాత సినిమా రిలీజ్ అయ్యింది. కానీ హిట్ కాలేదు. అయితేనేం ప్రియా క్రేజ్ ఏం తగ్గలేదు. తెలుగులో నితిన్ సరసన చెక్ సినిమాలో అవకాశం దక్కించుకుంది. ఇందులో చిన్న క్యామియో రోల్ చేసింది.
ఆ తర్వాత ‘ఇష్క్: నాట్ ఎ లవ్ స్టోరీ’ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ రెండు సినిమాలు ఆమెకు పెద్దగా కలిసి రాలేదు. ప్రియా వారియర్ కి సినిమాల పరంగా సక్సెస్ లేకపోయినా.. బయట మార్కెట్ లో ఉన్న క్రేజ్ తో వరుస సినిమా ఆఫర్లు పట్టేస్తుంది. హిందీలో 5 సినిమాలు, కన్నడలో 1, మలయాళంలో 2 సినిమాలు ఇలా వరుస సినిమాలతో ప్రస్తుతం బిజీగా ఉంది. ఎంత బిజీగా ఉన్నా కూడా అభిమానుల కోసం అందాల ట్రీట్ ఇవ్వడం అయితే మర్చిపోదు. సోషల్ మీడియాలో అమ్మడు లేపే రచ్చ మామూలుగా ఉండదు. అదన్న మాట విషయం.