సెలబ్రిటీలకు సంబంధించి త్రోబ్యాక్ ఫోటోలు, చైల్డ్ హుడ్ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుంటాయి. అభిమానుల పిచ్చి అట్లుంటది. హీరోలు, హీరోయిన్లు, దర్శకులు ఇలా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీల ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఫాలోవర్స్ ని ఎంగేజ్ చేస్తుంటారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఓ కుర్ర హీరోయిన్ చిన్నప్పటి ఫోటో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. నోట్లో వేలు పెట్టుకుని.. అద్దంలో ముఖం చూసుకుంటూ.. మురారి సినిమాలో సోనాలి బింద్రేలా మహేష్ ని ఏంట్లా అన్నట్టు క్యూట్ గా కనిపిస్తున్న ఈ హీరోయిన్ ని గుర్తుపట్టారా? పక్కన బిస్కెట్ డబ్బా ఒకటి పెట్టుకుంది. ఈమె మొదటి సినిమాతోనే విపరీతమైన క్రేజ్ దక్కించుకుంది. విజయ్ దేవరకొండకి యూత్ లో మంచి క్రేజ్ తీసుకొచ్చినటువంటి సినిమాలో నటించింది.
ఆ సినిమాలో కొంచెం బోల్డ్ గా కూడా నటించిందండోయ్. ఆ సినిమాలో ఆమె పేరు ప్రీతి. ఆ ఇప్పుడు గుర్తొచ్చిందా? అవును అమాయకమైన యువతిగా.. ఎంబీబీఎస్ స్టూడెంట్ ప్రీతిగా నటించిన షాలిని పాండేనే ఈ క్యూటీ. విజయ్ దేవరకొండ సరసన అర్జున్ రెడ్డి సినిమాలో నటించి యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఆ తర్వాత మహానటి సినిమాలో సావిత్రి ఫ్రెండ్ పాత్రలో నటించింది. ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో షావుకారు జానకి పాత్రలో నటించింది. రొమాంటిక్ పాత్రలే కాకుండా.. అలనాటి సీనియర్ నటీమణుల పాత్రలను సైతం చేసి మెప్పించింది. తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ భాష చిత్రాల్లో కూడా నటించింది. ప్రస్తుతం బాలీవుడ్ లో మాహారాజా అనే సినిమాలో నటిస్తోంది. అవకాశాల కోసం ఎదురుచూస్తున్న షాలిని సోషల్ మీడియాలో మాత్రం పరువాల విందు చేస్తూ ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ ఇస్తుంది.