ఈ ఫోటోలో ఉన్న హీరోయిన్ ని గుర్తుపట్టారా?
పై ఫోటోలో కనిపిస్తున్నది ఒకప్పుడు తెలుగు సినిమాల్లో నటించిన ఒక హీరోయిన్. తెలుగు సినిమాల్లో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంటున్న సమయంలోనే హఠాత్తుగా పెళ్లిచేసుకొని మాయం అయ్యింది. కానీ ఇప్పుడు ఇనిస్టాగ్రమ్ ద్వారా తన అభిమానులతో ఎప్పుడు టచ్ లోనే ఉంటు తనకి సంబంధించిన కొన్ని పిక్స్ ని ఇనిస్టా గ్రామ్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం తను పోస్ట్ చేసిన కొన్ని పిక్స్ వైరల్ అయ్యాయి. తన గురించి తెలిసిన వాళ్ళు ఇంత వయసులో కూడా అంతే గ్లామర్ గా ఎలా ఉంది అని అనుకుంటుంటే తెలియని వాళ్ళు ప్రస్తుతం తను ఏ సినిమా లో చేస్తుందో తెలుసుకోవాలని తన ఇనిస్టాగ్రామ్ అకౌంట్ ని ఫాలో అయ్యి చివరికి తనెవరో అర్ధమయ్యి షాక్ అవుతున్నారు.
తమిళనాడుకి చెందిన దివ్య వెంకట సుబ్రహ్మణ్యం 2002 వ సంవత్సరం లో దర్శకుడు మణిరత్నం సొంత నిర్మాణ సంస్థ మద్రాస్ టాకీస్ నిర్మించిన ఫైవ్ స్టార్ అనే తమిళ సినిమా ద్వారా కనిహ అనే పేరుతో సినీరంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత తెలుగులో శ్రీకాంత్ హీరోగా 2003 లో వచ్చిన ఒట్టేసి చెబుతున్న సినిమా ద్వారా తెలుగు తెరకి పరిచయమైంది.ఆ సినిమా లో తన క్యారక్టర్ కి తగట్టు ముగ్ద మనోహరం గా నటించి మంచి నటీమణి అనే పేరు తెచ్చుకుంది. ఆ సినిమా పెద్ద హిట్ కూడా..ఆ సినిమా లో కనిహ అభినయం చూసిన సినీ పండితులు కనిహ రూపంలో తెలుగు సినీ పరిశ్రమకి ఇంకో సౌందర్య దొరికిందని అనుకున్నారు. ఆ తర్వాత రవితేజ నటించిన నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ సినిమా లో కూడా ఒక మంచి క్యారక్టర్ లో నటించి మంచి పేరు తెచ్చుకుంది.
ఆ తర్వాత కనిహ ఇంక ఏ తెలుగు సినిమా లోను నటించలేదు.కానీ మలయాళం తమిళంలో కలిపి 20 సినిమాలకి పైనే నటించింది. హీరోయిన్ గానే కాకుండా నటనకి స్కోప్ ఉన్న మంచి పాత్రల్ని చేస్తూ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది..ఇప్పటికి ఆయా భాషాల్లో నటిస్తూ ఉంది కూడా. 2006లో వచ్చిన వరలారు అనే తమిళ మూవీ కి సంబంధించి బెస్ట్ సపోర్ట్ యాక్టర్ కోటా లో అత్యంత ప్రతిష్టాత్మక మైన ఫిల్మ్ ఫేర్ అవార్డు కి కనిహ నామినేట్ అయ్యింది. ఇప్పుడు కనిహ వయసు 41 సంవత్సరాలు.ఈ వయసులో కూడా ఇప్పుడున్న యువ హీరోయిన్లకి ఏ మాత్రం తీసిపోని విధంగా ఫుల్ గ్లామర్ తో ఉన్న కనిహ పిక్స్ చూసి అందరూ షాక్ అవుతున్నారు. మీరు కూడా ఒక లుక్ వెయ్యండి.