ఈ మధ్యకాలంలో గ్లామర్ షో పరంగా హద్దులు పెట్టుకోకుండా నిర్మొహమాటంగా అందాలను కెమెరా ముందు పెట్టేస్తున్నారు ముద్దుగుమ్మలు. ఎందుకంటే.. ట్రెండ్ అలా మారిపోయింది. ట్రెండ్ తో పాటే హీరోయిన్స్ తమను తాము అప్ డేట్ చేసుకుంటూ దూసుకుపోతున్నారు. అలా సినీ బ్యాక్ గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చిన బోల్డ్ బ్యూటీలు కొంతమంది ఉన్నారు. అలాంటి బ్యూటీల పేర్లు సినిమాలలో కంటే.. ఎక్కువగా సోషల్ మీడియాలోనే తెగ ట్రెండ్ అవుతుంటాయి.
ఈ మధ్యకాలంలో గ్లామర్ షో పరంగా హద్దులు పెట్టుకోకుండా నిర్మొహమాటంగా అందాలను కెమెరా ముందు పెట్టేస్తున్నారు ముద్దుగుమ్మలు. ఎందుకంటే.. ట్రెండ్ అలా మారిపోయింది. ట్రెండ్ తో పాటే హీరోయిన్స్ తమను తాము అప్ డేట్ చేసుకుంటూ దూసుకుపోతున్నారు. అయితే.. ఇండస్ట్రీలోకి హీరోయిన్స్ గా బయట భామలు ఎక్కువగా వచ్చినప్పటికీ.. సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న భామలు సౌత్ లో రేర్ గా వస్తుంటారు. అలా సినీ బ్యాక్ గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చిన బోల్డ్ బ్యూటీలు కొంతమంది ఉన్నారు. అలాంటి బ్యూటీల పేర్లు సినిమాలలో కంటే.. ఎక్కువగా సోషల్ మీడియాలోనే తెగ ట్రెండ్ అవుతుంటాయి.
ఆ విధంగా సోషల్ మీడియాలో అందాల రచ్చ చేస్తున్న హీరోయిన్స్ లో మాళవిక మోహనన్ ఒకరు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మోహనన్ కూతురిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ భామ.. దళపతి విజయ్ సరసన మాస్టర్ సినిమాలో నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది. అంతకుముందు డెబ్యూ మూవీలోనే సూపర్ స్టార్ రజినికి సోదరిగా నటించింది. అయితే.. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే మాళవిక.. తన సినిమాల అప్ డేట్స్ కంటే ఎక్కువగా గ్లామరస్ ఫొటోలతో ఫ్యాన్స్ ని పలకరిస్తుంటుంది. ప్రస్తుతం ఈ వయ్యారి టాలీవుడ్ డెబ్యూకి రెడీ అయిపోయింది. డార్లింగ్ ప్రభాస్ సరసన మారుతీ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
ఆ సినిమాకి ప్రస్తుతం రాజాడీలక్స్ అనే పేరు వాడుకలో ఉంది. కాగా.. ఈ సినిమా ద్వారా మాళవిక తెలుగు డెబ్యూ చేయబోతుంది. అయితే.. గతంలో విజయ్ దేవరకొండ సరసన డెబ్యూ చేయాల్సి ఉండగా.. వారి కాంబినేషన్ లో మూవీ క్యాన్సల్ అవ్వడంతో అమ్మడు.. అటు తమిళ, హిందీ మూవీస్ పై ఫోకస్ పెట్టింది. కానీ.. ఇప్పుడు మొత్తానికి ఈ మలయాళీ భామ.. ఇన్నాళ్లు హాట్ హాట్ అందాలతో అలరించినప్పటికీ.. త్వరలో స్ట్రయిట్ గా పలకరించనుంది. ఈ క్రమంలో తాజాగా మాళవికకి సంబంధించి చిన్ననాటి ఫోటో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. ఫ్లవర్ డిజైన్డ్ డ్రెస్ లో మాళవిక అసలు గుర్తుపట్టలేకుండా క్యూట్ గా ఉంది. మీరు కూడా మాళవిక చిన్ననాటి పిక్ చూసి ఎలా ఉందొ కామెంట్స్ లో తెలపండి.
A white to remember 🤍✨ pic.twitter.com/j0tEaGifc2
— Malavika Mohanan (@MalavikaM_) July 25, 2022