ఏ రంగంలోనైనా పాతనీరు పోయి కొత్తనీరు రావడం మామూలే. సినీ ఇండస్ట్రీలో కూడా అంతే. హీరోయిన్స్ పాతబడుతున్నకొద్దీ కొత్త హీరోయిన్స్ వస్తూనే ఉంటారు.. అలా కొత్తగా వస్తున్న అందాలను స్వీకరిస్తూ.. సినిమాలను ఎంజాయ్ చేస్తుంటారు ప్రేక్షకులు. హీరోయిన్ గా ఓ భాషలో అడుగుపెట్టి.. కేవలం ఒకే ఒక్క సినిమాతో కనుమరుగైన వారిని చాలా తక్కువమందిని చూస్తుంటాం. అలా 1999లో బ్లాక్ బస్టర్ సినిమాతో డెబ్యూ చేసిన హీరోయిన్.. ఆ ఒక్క సినిమా తర్వాత తెలుగులో కనిపించకుండా పోయింది. ఆ హీరోయిన్ ఎవరో కాదు.. అదితి గోవత్రికర్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘తమ్ముడు’ సినిమాతో డెబ్యూ చేసింది.
తమ్ముడు సినిమాలో హీరోయిన్ ప్రీతీ జింగానీయా ‘జానూ’ క్యారెక్టర్ కాకుండా.. లవ్ లీ క్యారెక్టర్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ లవ్ లీ క్యారెక్టర్ లో కనిపించిన బ్యూటీనే ఈ అదితి గోవత్రికర్. ఈ సినిమాలో లవ్ లీ కోసం పవన్ పాడిన పాట ఎంతో పాపులర్ అయ్యింది. సుబ్బు క్యారెక్టర్ లో పవన్ పాటపాడుతూ.. “హే పిల్ల నీ పేరు లవ్ లీ.. జారిపోకే చాపల్లె తుల్లి.. జాంపండులా ఉన్నావే బుల్లి..” అంటూ వెంటపడిన వయ్యారిభామ ఈమెనే. ఇన్నేళ్లయిందిగా అదితి ఫేస్ అందరూ మర్చిపోయి ఉంటారు. కానీ.. తమ్ముడు సినిమా అనగానే.. పవన్ కళ్యాణ్, ప్రీతీలతో పాటు లవ్ లీ క్యారెక్టర్ ని ఎప్పటికీ మర్చిపోలేరనే చెప్పాలి.
అతిథి తెలుగులో చేసింది ఒక్క సినిమానే అయినా.. ఇంపాక్ట్ మాత్రం బాగానే క్రియేట్ చేసింది. మహారాష్ట్రలోని పన్వేల్ ఏరియాలో పుట్టిపెరిగిన అదితి.. చిన్న వయసులోనే మోడలింగ్ లో అడుగుపెట్టింది. ఎన్నో బ్యూటీ కాంపిటీషన్స్ లో టైటిల్స్ గెలిచి.. తెలుగులో ‘తమ్ముడు’ సినిమాతోనే యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేసింది. ఆ తర్వాత నుండి పూర్తిగా హిందీ సినిమాలకే పరిమితమైంది. మరి తెలుగులో డెబ్యూ మూవీనే హిట్ అయ్యాక.. అవకాశాలు బాగానే వచ్చి ఉంటాయి. కానీ, బాలీవుడ్ లో సెటిల్ అవ్వాలనే ఆలోచనతో అక్కడి సినిమాలే చేసుకుంటూ ఉండిపోయిందని సమాచారం.
ఇక సినిమాల్లోకి రాకముందు మెడిసిన్ చదివిన అదితి.. కాలేజీ రోజుల్లో పరిచయమైన ముఫజల్ లక్డావాలా అనే వ్యక్తితో ఏడేళ్లు డేటింగ్ చేసింది. ఆ తర్వాత సినిమాల్లోకి రాకముందే అంటే.. 1998లో అతన్ని పెళ్లి చేసుకుంది. వీరికి 1999లో ఓ కూతురు కియారా, 2007లో రెండో కూతురు జన్మించారు. కాగా.. భార్యాభర్తల మధ్య మనస్పర్థల కారణంగా అదితి – ముజఫల్ 2009లో విడాకులు తీసుకున్నారు. ఇదిలా ఉండగా.. పెళ్లయ్యాక కూడా అడపాదడపా సినిమాలు చేస్తూ వచ్చిన అదితి.. ఈ మధ్య టీవీ షోలలో, వెబ్ సిరీస్ లలో కూడా మెరుస్తోంది. తాజాగా అదితి టాపిక్ వెలుగులోకి రాగా.. తమ్ముడు సినిమాలో లవ్ లీ క్యారెక్టర్ తో పోల్చుతూ ఎంత మారిపోయిందో అని మాట్లాడుకుంటున్నారు నెటిజెన్స్. ప్రస్తుతం అదితి పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి ఈమె గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.